పాకిస్తాన్ ఆర్మీని ఎదురొడ్డి పోరాడిన ధీరుడు
మన దేశానికి స్వాతంత్రం తీసుకొని రావడానికి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. స్వాతంత్రం వచ్చాక దేశాన్ని కాపాడుకోవడానికి కూడా ఎంతో మంది సైనిక వీరులు అమరులు అవుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ కుయుక్తులతో దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా మన భారత సైనికులు తిప్పికొడుతున్నారు. కాగా, ఒకానొకప్పుడు ఇలాగే పాక్ ఆధీనంలో ఉన్న 800 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఒక సైనికుడు తన ధైర్యసాహసాలతో తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఆయనే చెవాంగ్ రిన్‌చెన్. లద్దాఖ్‌లో పుట్టిన రిన్‌చెన్ […]
మన దేశానికి స్వాతంత్రం తీసుకొని రావడానికి ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. స్వాతంత్రం వచ్చాక దేశాన్ని కాపాడుకోవడానికి కూడా ఎంతో మంది సైనిక వీరులు అమరులు అవుతున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ కుయుక్తులతో దేశాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడల్లా మన భారత సైనికులు తిప్పికొడుతున్నారు.
కాగా, ఒకానొకప్పుడు ఇలాగే పాక్ ఆధీనంలో ఉన్న 800 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని ఒక సైనికుడు తన ధైర్యసాహసాలతో తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఆయనే చెవాంగ్ రిన్‌చెన్. లద్దాఖ్‌లో పుట్టిన రిన్‌చెన్ 17 ఏళ్ల వయసులోనే భారత ఆర్మీలో చేరాడు. పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధంలో ప్రదర్శించిన ధైర్యసాహసాలకు మెచ్చి భారత ప్రభుత్వం మహావీరచక్ర అవార్డుతో సత్కరించింది.
1962 చైనా యుద్ధంలో, 1965 పాక్‌తో జరిగిన యుద్ధంలో అదే జోరు సాగించాడు. 1971 పాక్‌తో జరిగిన యుద్ధంలో పాక్ ఆధీనంలోని దాదాపు 800 చ.కి.మీ. భూభాగాన్ని స్వాధీనం చేసుకున్నాడు. పాక్ లొంగిపోకపోయి వుంటే యావత్ పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్ స్వాధీనమై ఉండేదని రక్షణ రంగనిపుణులు చెబుతారు. ప్రపంచంలోని ఎత్తైన ప్రాంతంలోని లద్దాఖ్‌లో జన్మించిన రిన్‌చెన్ పేరు చెబితేనే పాక్ వణికిపోయేది. పెద్దగా చదువుకోకపోయినా అనూహ్యమైన వ్యూహాలతో శత్రువులను మట్టికరిపించేవాడు.
1947-48 పాక్ యుద్ధంలో పాక్ దళాలు లద్దాఖ్ వైపు దూసుకువస్తున్నాయి. దీన్ని పసిగట్టన కెప్టెన్ ప్రీతిచంద్ నేతృత్వంలో రిన్‌చెన్‌తో పాటు మరి కొందరు సైనికులు ముందుగానే లద్దాఖ్ చేరేందుకు వ్యూహం రచించారు. అప్పుడే మంచు భారీగా కురుస్తోంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మృత్యువాతపడటం ఖాయం. దీన్ని గమనించిన రిన్‌చెన్ తదితరులు జాగ్రత్తగా జొజిలా మార్గాన్ని దాటి లద్దాఖ్ రాజధాని లేహ్‌కు చేరుకున్నారు. భారతీయ సైనికుల ఉనికిని తెలుసుకున్న పాక్ దళాలు అక్కడికి వెళ్లే ఆలోచనను విరమించుకున్నాయి. భారత సైనికులు ఆ రోజున లద్దాఖ్ చేరకపోయివుంటే ఆ ప్రాంతం పాక్ స్వాధీనమైవుండేది.
1971లో పాక్‌తో జరిగిన బంగ్లా విముక్తి పోరాటంలో ఆయన చూపిన సాహసం భారతీయ సైనికుల పోరాటతత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. 1948లోనే కశ్మీర్‌లోని అనేకప్రాంతాలను ఆక్రమించిన పాక్ వాటిని ఆజాద్ కశ్మీర్ పేరుతో పిలిచేది. నుబ్రాలోయను స్వాధీనం చేసుకోవాలని పాక్ సైన్యం పన్నాగం పన్నింది. నుబ్రా పరిరక్షణ బాధ్యతలను రిన్‌చెన్‌పై ఉంచారు. ఈ యుద్ధంలో చెన్ వినూత్నమైన విధానాన్ని ప్రవేశపెట్టాడు. పూర్తిగా లద్దాఖ్ వాతావరణానికి సరిపడే దుస్తులను సహచరులకు ఇవ్వడంతో సైనికులు త్వరగా ముందుకు వెళ్లగలిగారు. పాక్ సైనికులను దారుణంగా దెబ్బతీయడంతో పాటు టర్‌టక్ ప్రాంతం సహా 800 చ.కి.మీ పరిధి కలిగిన ప్రాంతాన్ని పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి స్వాధీనం చేసుకున్నారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్ మొత్తాన్ని భారత్ స్వాధీనంలోకి తీసుకురావాలని వ్యూహాలు రచిస్తున్న సమయంలో పాక్ లొంగిపోయింది. దీంతో యుద్ధం ముగిసింది. పాక్ ఓటమిని అంగీకరించకపోయివుంటే ఆక్రమిత కశ్మీర్ యావత్తు భారత స్వాధీనం అయివుండేది. ఈ రోజు కశ్మీర్‌లో జరుగుతున్న అశాంతి వుండేదికాదు. రిన్‌చెన్‌ను భారత ప్రభుత్వం మహావీరచక్ర అవార్డుతో సత్కరించింది. ఆయన స్వాధీనం చేసుకున్న ప్రాంతం భారత్‌లో విలీనం చేశారు. అందుకనే లద్దాఖ్ ఇప్పటికీ భారతదేశంలోనే ఉంది.