Telugu Global
National

ఆంధ్రజ్యోతిపై ప్రభుత్వం సీరియస్

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లపై ఏపీ ప్రభుత్వం నిఘా ఉంచిందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన కథనంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆంధ్రజ్యోతిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు పక్కా వ్యూహంతోనే కుట్రపూరితంగా ఈ కథనం సృష్టించారని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ కథనం సృష్టి వెనుక కొన్ని రాజకీయ శక్తులు, మీడియా సంస్థలు కలిసి కుట్ర చేస్తున్నాయని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించి… ప్రభుత్వంపై వ్యతిరేక […]

ఆంధ్రజ్యోతిపై ప్రభుత్వం సీరియస్
X

ఏపీ హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లపై ఏపీ ప్రభుత్వం నిఘా ఉంచిందంటూ ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించిన కథనంపై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. ఆంధ్రజ్యోతిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. న్యాయవ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలను దెబ్బతీసేందుకు పక్కా వ్యూహంతోనే కుట్రపూరితంగా ఈ కథనం సృష్టించారని ప్రభుత్వం అభిప్రాయపడింది.

ఈ కథనం సృష్టి వెనుక కొన్ని రాజకీయ శక్తులు, మీడియా సంస్థలు కలిసి కుట్ర చేస్తున్నాయని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయవ్యవస్థను తప్పుదోవ పట్టించి… ప్రభుత్వంపై వ్యతిరేక భావన కలిగించేందుకే ఈ పని చేశారంది.

ఈ వ్యవహారంలో నేరుగా న్యాయవ్యవస్థతో చర్చలు జరిపి తదుపరి చర్యలపై ముందుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. పత్రికపై చట్టపరమైన చర్యలను ప్రారంభించబోతున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది.

ఏపీ హైకోర్టుకు చెందిన ఐదారుగురు న్యాయమూర్తుల ఫోన్లు ట్యాపింగ్‌కు గురయ్యాయంటూ ఒక కథనాన్ని ఆ పత్రిక ప్రచురించింది. ఈ విషయాలను న్యాయమూర్తులే చెప్పారా, మరెవరి ద్వారా తెలిశాయి అన్న దానిపై మాత్రం ఆ పత్రిక వివరించలేదు. ఇలా నేరుగా ఏపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ కథనం రావడంతో ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది.

First Published:  15 Aug 2020 1:47 PM IST
Next Story