కోర్టు ధిక్కారం కేసులో ప్రశాంత్ భూషణ్‌కు శిక్ష?
ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డారని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 2020 జూన్ 27, 28న ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎస్ఏ బాబ్డే ఫొటోతో సహా ఆయన ట్విట్టర్‌లో వరుసగా చేసిన రెండు పోస్టుల్లోని వ్యాఖ్యలు కోర్టును ధిక్కరించేలా ఉన్నదని చెబుతూ కేసును ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అతడిని దోషిగా తేల్చింది. ప్రశాంత్ […]
ప్రముఖ సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డారని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 2020 జూన్ 27, 28న ప్రధాన న్యాయమూర్తి జస్టీస్ ఎస్ఏ బాబ్డే ఫొటోతో సహా ఆయన ట్విట్టర్‌లో వరుసగా చేసిన రెండు పోస్టుల్లోని వ్యాఖ్యలు కోర్టును ధిక్కరించేలా ఉన్నదని చెబుతూ కేసును ధర్మాసనం సుమోటోగా స్వీకరించింది. శుక్రవారం దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అతడిని దోషిగా తేల్చింది.
ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టుకు, ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా చేసిన ట్వీట్లు న్యాయపాలనను అపఖ్యాతిలోకి తెచ్చాయని, అంతే కాకుండా భారత అత్యున్నత న్యాయస్థాన గౌరవాన్ని, అధికారాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. కాగా, క్రిమినల్ కంటెంప్ట్ కింద అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్‌కు విధించాల్సిన శిక్షపై ఈ నెల 20న వాదనలు వింటుందని వెల్లడించింది. సీనియర్ లాయర్ భూషణ్‌కు ఈ కేసులో ఆరునెలల జైలు శిక్ష లేదా రూ. 2000 జరిమానా, లేదా రెండూ కలిపి వేసే అవకాశమున్నది.
సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే ఓ బీజేపీ నేతకు చెందిన హర్లీ డేవిడ్సన్ బైక్‌పై కూర్చుని ఉన్న ఫొటోపై వ్యాఖ్యానిస్తూ జూన్ 29న ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. లాక్ డౌన్ సమయంలో సామాన్యులకు సుప్రీం కోర్టులో న్యాయం పొందే ప్రాథమిక హక్కును నిరాకరించి, బీజేపీ నాయకుడి మోటార్ వాహనం నడుపుతున్నారని వివాదాస్పద ట్వీట్ చేశారు.
SC: Tweet tends to convey is that the judges who have presided in the Supreme Court in the period of last six years have particular role in the destruction of Indian democracy and the last four CJIs had a more particular role in it.
— Krishnadas Rajagopal (@kdrajagopal) August 14, 2020