జాంబీ రెడ్డిపై క్లారిటీ
రీసెంట్ గా జాంబీ రెడ్డి అనే సినిమా ఎనౌన్స్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తన మూడో ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈ టైటిల్ పై వివాదాలు మొదలయ్యాయి. ఓ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నాడంటూ విమర్శలు మొదలయ్యాయి. దీంతో స్వయంగా ప్రశాంత్ వర్మ రంగంలోకి దిగాడు. తన సినిమాలో ఏ కమ్యూనిటీనీ కించపరడం లేదని చెప్పుకొచ్చాడు. కర్నూలు బ్యాక్ డ్రాప్ లో […]
రీసెంట్ గా జాంబీ రెడ్డి అనే సినిమా ఎనౌన్స్ చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. తన మూడో ప్రాజెక్టుగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి టైటిల్ మోషన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశాడు. అయితే ఈ టైటిల్ పై వివాదాలు మొదలయ్యాయి. ఓ కమ్యూనిటీని టార్గెట్ చేస్తూ సినిమా తీస్తున్నాడంటూ విమర్శలు మొదలయ్యాయి.
దీంతో స్వయంగా ప్రశాంత్ వర్మ రంగంలోకి దిగాడు. తన సినిమాలో ఏ కమ్యూనిటీనీ కించపరడం లేదని చెప్పుకొచ్చాడు. కర్నూలు బ్యాక్ డ్రాప్ లో కరోనా వైరస్ కథతో తెరకెక్కిస్తున్న ఈ కథకు జాంబీ రెడ్డి అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని అంటున్నాడు.
కర్నూలు ప్రాంత ప్రజల్ని, ఓ వర్గాన్ని మరింత గొప్పగా చూపించేలా జాంబీ రెడ్డి ఉంటుందని చెబుతున్నాడు ప్రశాంత్. సినిమా చూసిన తర్వాత ఎలాంటి వివాదాలు ఉండవని ధీమాగా చెబుతున్నాడు.
“అ!” సినిమాతో తనకు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని, జాంబీ రెడ్డితో తనకు ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వస్తుందని చెబుతున్నాడు. టాలీవుడ్ లో వస్తున్న మొట్టమొదటి జాంబీ సినిమా ఇదే.