Telugu Global
Cinema & Entertainment

మళ్లీ తల్లి కాబోతున్న హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ మళ్లీ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని కరీనా-సైఫ్ దంపతులు పరోక్షంగా వెల్లడించారు. తమ కుటంబాన్ని విస్తరించుకునే ఆలోచనలో ఉన్నామని వాళ్లు ప్రకటించారు. కరీనా-సైఫ్ కు చాలామంది బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు అందిస్తున్నారు. సైఫ్-కరీనాకు ఇప్పటికే తైమూర్ అనే అబ్బాయి ఉన్నాడు. వాడు చేస్తున్న అల్లరి, క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీడికి తోడుగా మరో మెంబర్ తమ ఫ్యామిలీలోకి వస్తుందని కరీనా ప్రకటించింది. పెళ్లి […]

మళ్లీ తల్లి కాబోతున్న హీరోయిన్
X

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ మళ్లీ తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని కరీనా-సైఫ్ దంపతులు పరోక్షంగా వెల్లడించారు. తమ కుటంబాన్ని విస్తరించుకునే ఆలోచనలో ఉన్నామని వాళ్లు ప్రకటించారు. కరీనా-సైఫ్ కు చాలామంది బాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు అందిస్తున్నారు.

సైఫ్-కరీనాకు ఇప్పటికే తైమూర్ అనే అబ్బాయి ఉన్నాడు. వాడు చేస్తున్న అల్లరి, క్యూట్ ఫొటోస్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు వీడికి తోడుగా మరో మెంబర్ తమ ఫ్యామిలీలోకి వస్తుందని కరీనా ప్రకటించింది.

పెళ్లి తర్వాత కూడా వరుసగా అవకాశాలు దక్కించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. తైమూర్ పుట్టిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని, మళ్లీ నాజూకైన బాడీ సొంతం చేసుకొని సినిమాల్లోకి వచ్చింది. రెండో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఈమె మరోసారి సినిమాల్లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అమీర్ ఖాన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది కరీనా.

First Published:  14 Aug 2020 5:00 AM IST
Next Story