నిర్ణయాధికారం మాదే " హైకోర్టులో ఏపీ ప్రభుత్వం
మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియజేసిందని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో గుర్తు చేసింది. రాజధాని అంశంతో పాటు వివిధ అభివృద్ధి ప్రణాళికలను, ప్రాజెక్టులను సమీక్షించే విస్తృతాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల ఆమోదం తర్వాత ఆఫీసుల […]
మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటుందని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విషయాన్ని హైకోర్టుకు అఫిడవిట్ రూపంలో తెలియజేసిందని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్‌లో గుర్తు చేసింది.
రాజధాని అంశంతో పాటు వివిధ అభివృద్ధి ప్రణాళికలను, ప్రాజెక్టులను సమీక్షించే విస్తృతాధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాల ఆమోదం తర్వాత ఆఫీసుల తరలింపుపై పిటిషనర్లు లేవనెత్తిన అంశాలు న్యాయ సమీక్షకు అర్హమైనవి కాదని తెలిపింది. తన అఫిడవిట్‌లో ప్రత్యేక హోదా అంశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం ప్రస్తావించింది.
ప్రత్యేకహోదా ఇవ్వనంత కాలం విభజన చట్టం అమలు అసంపూర్తిగా ఉన్నట్టేనని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది. ఇప్పటికీ ప్రతి మీటింగ్‌లోనూ ప్రత్యేక హోదా గురించి అడుగుతున్నామని ఏపీ ప్రభుత్వం వివరించింది.