Telugu Global
National

హ్యాపి నెస్ట్‌ బిల్డింగులను పూర్తి చేయండి " సీఎం జగన్‌

అమరావతిలో నిర్మాణాలను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రాజధానుల నేపథ్యంలో భాగంగా అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగించాలని సీఎం ఆదేశించారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీపై సమీక్ష నిర్వహించిన సీఎం…ప్రస్తుతం ఏయే దశల్లో నిర్మాణాలు ఉన్నాయో అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. హ్యపీ నెస్ట్‌ బిల్డింగులను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ… అమరావతి కూడా రాష్ట్రంలో అంతర్భాగమేనని వ్యాఖ్యానించారు. అక్కడ నిర్మాణ పనులను తక్షణం ప్రారంభించాల్సిందిగా సీఎం ఆదేశించారన్నారు. […]

హ్యాపి నెస్ట్‌ బిల్డింగులను పూర్తి చేయండి  సీఎం జగన్‌
X

అమరావతిలో నిర్మాణాలను కొనసాగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మూడు రాజధానుల నేపథ్యంలో భాగంగా అమరావతిలో కూడా అభివృద్ధి కొనసాగించాలని సీఎం ఆదేశించారు. అమరావతి మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీపై సమీక్ష నిర్వహించిన సీఎం…ప్రస్తుతం ఏయే దశల్లో నిర్మాణాలు ఉన్నాయో అధికారులను సీఎం అడిగి తెలుసుకున్నారు. హ్యపీ నెస్ట్‌ బిల్డింగులను పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.

అనంతరం మీడియాతో మాట్లాడిన బొత్స సత్యనారాయణ… అమరావతి కూడా రాష్ట్రంలో అంతర్భాగమేనని వ్యాఖ్యానించారు. అక్కడ నిర్మాణ పనులను తక్షణం ప్రారంభించాల్సిందిగా సీఎం ఆదేశించారన్నారు. వెయ్యి కోట్లు కావచ్చు… రెండు వేల కోట్లు కావొచ్చు, పదివేల కోట్లు కావొచ్చు అని … అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకునే ముందుకెళ్తామన్నారు. గ్రాఫిక్స్‌లు చూపించే అలవాటు తమ ప్రభుత్వానికి లేదన్నారు.

వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించిన వెంటనే మూడు రాజధానులకు శంకుస్థాపన చేయాలని భావించామని… కానీ కోర్టులకు వెళ్లి టీడీపీ అనే దుష్టశక్తి అడ్డుకుంది అని వ్యాఖ్యానించారు. కాస్త ఆలస్యం అయినా మూడు రాజధానుల ఏర్పాటు జరిగి తీరుతుందన్నారు.

First Published:  13 Aug 2020 11:42 AM IST
Next Story