రాయలసీమ ఎత్తిపోతలకు.... చంద్రబాబే పెద్ద అడ్డంకి
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించే సమయంలో పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పంద చర్చలు జరిపి అప్పటి వరకు ఉన్న సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయ్యింది. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం […]
తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు పొరుగు రాష్ట్రాలతో సఖ్యతగా ఉండి సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మించే సమయంలో పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పంద చర్చలు జరిపి అప్పటి వరకు ఉన్న సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకున్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణం పూర్తయ్యింది. లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది.
ఆంధ్రప్రదేశ్ లో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధమయ్యారు. పొరుగున ఉన్న తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాలతో చర్చలు జరిపి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రితో సమావేశమై సాగు నీరు మరియు ఇతర వివాదాలు పరిష్కరించుకునేందుకు సిద్ధం అయ్యారు. అయితే ఇది నచ్చని చంద్రబాబు, వారిద్దరూ స్నేహపూర్వకంగా ఉంటే తమకు రాజకీయంగా ఇబ్బంది అని భావించి రాష్ట్రానికి ప్రయాజనం చేకూర్చే పథకాలకు అడ్డంకులు సృష్టించేందుకు సిద్ధమయ్యారు.
అడుగడుగునా బాబు అడ్డంకులు..
తెలంగాణలో ప్రభుత్వంతో సహా ప్రతిపక్ష పార్టీలు ఒక్కతాటిపైకి వచ్చి రాయలసీమ ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా పోరాడుతుంటే ఏపీలో మాత్రం పరిస్థితి వేరేలా ఉంది. నారా బాబు రాష్ట్ర ప్రయోజనాలను పక్కకు నెట్టి సొంత ప్రయోజనాలకోసం పోరాడుతున్నారు.
రాయలసీమను సస్యశ్యామలం చేసే రాయలసీమ ప్రాజెక్ట్ పై చంద్రబాబు, తన అనుచరణగణం, అనుచర పార్టీలైన సిపీఐ, కాంగ్రెస్, బిజెపీ లోని కొందరు నేతలు పచ్చమీడియా సహాయంతో కుట్రలు పన్నుతున్నారు. రాయలసీమ ప్రాజెక్ట్ ను పరుగులు పెట్టిస్తే జగన్ కు మంచి పేరు వస్తుందనేది చంద్రబాబు భయం.
ఇక్కడ కూడా రాజకీయంగా ఆలోచిస్తున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి అస్సలు మాట్లాడడం లేదు . హైదరాబాద్ లోని తన విలాసవంతమైన భవంతి లో సేద తీరుతూ అపుడపుడు రాష్ట్ర ప్రాయాజనాల కోసం ఆలోచన చేస్తారు అనుకుంటే జూమ్ బాబు మాత్రం రాష్ట్రానికి నష్టం కలిగించే చర్యలకు పూనుకుంటున్నారు.
ఉండవల్లి కరకట్ట నివాసంలో ఉన్నపుడు అందుబాటులో ఉన్న నేతల సమావేశం పేరుతొ హడావిడి చేసే చంద్రబాబు ఇపుడు జూమ్ ను ఉపయోగించుకొని పార్టీ నేతలతో సమావేశంతో పాటు తనకు అనుకూలమైన పచ్చ మీడియా ప్రతినిధులతో అనుకూల ప్రశ్నలు వేయించుకుంటూ… ప్రభుత్వం చేపట్టే ప్రతి పనికి అడ్డంకులు సృష్టిస్తూ…. తానూ రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడే యోధుడిని అని కలర్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
అందులో భాగంగానే రాష్ట్ర ప్రయోజనాల కోసం చేపట్టిన రాయలసీమ పథకాన్ని వివాదాస్పదం చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.