వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పెనుమత్స సురేష్ బాబు
మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అధికారికంగా ప్రకటించబోతున్నారు. సోమవారం కన్నుమూసిన సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కుమారుడే డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు. జగన్‌మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో పెనుమత్స సాంబశివరాజు వైసీపీతోనే ఉంటూ వచ్చారు. వయసు రిత్యా కొద్దికాలంగా ఆయన చురుగ్గా వ్యవహరించలేకపోయారు. పెనుమత్స మరణంతో ఆయన కుటుంబసభ్యులను జగన్‌మోహన్ […]
మోపిదేవి వెంకటరమణ రాజ్యసభకు వెళ్లడంతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు పేరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఖరారు చేశారు. అధికారికంగా ప్రకటించబోతున్నారు. సోమవారం కన్నుమూసిన సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు కుమారుడే డాక్టర్ పెనుమత్స సురేష్ బాబు.
జగన్‌మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి విజయనగరం జిల్లాలో పెనుమత్స సాంబశివరాజు వైసీపీతోనే ఉంటూ వచ్చారు. వయసు రిత్యా కొద్దికాలంగా ఆయన చురుగ్గా వ్యవహరించలేకపోయారు. పెనుమత్స మరణంతో ఆయన కుటుంబసభ్యులను జగన్‌మోహన్ రెడ్డి ఫోన్‌లో పరామర్శించారు. ఆ సందర్భంగా డాక్టర్ సురేష్ బాబును ఓదార్చారు. పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ నేపథ్యంలోనే పెనుమత్స సురేష్ బాబు పేరును ఎమ్మెల్సీ స్థానానికి జగన్ ఖరారు చేశారు. ఇప్పటికే ఈ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. నామినేషన్ దాఖలుకు ఈనెల 13 ఆఖరి తేది. తొలుత వేరొకరి పేరును జగన్ అనుకున్నా… తొలి నుంచి వైసీపీతో ఉన్న పెనుమత్స కుటుంబానికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో మనసు మార్చుకుని సురేష్ బాబు పేరును ఖాయం చేశారు. నేడు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
ఈనెల 24న ఎన్నిక జరగాల్సి ఉంది. ఎమ్మెల్యే కోటాకు సంబంధించిన ఈ స్థానం సంఖ్యాపరంగా వైసీపీకే దక్కనుంది. టీడీపీ బరిలో నిలిచే అవకాశాలు కూడా లేవు. ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.