కరోనా కేసులు 2 కోట్లు
గత ఏడాది డిసెంబర్‌లో చైనాలోని వూహాన్‌లో తొలి కేసు గుర్తించిన దగ్గర నుంచి అగస్టు 10కి కరోనా బారిన పడిన వారి సంఖ్య 2 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. ఆదివారం రాత్రి 1,99,22,762 కేసులు ఉండగా… సోమవారం ఉదయం 10 గంటలకు 2,00,26,161కి చేరుకుంది. ఇప్పటి వరకు కరోనా బారిన పడి 7,31,747 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా మరణాల రేటు 3.7గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు […]
గత ఏడాది డిసెంబర్‌లో చైనాలోని వూహాన్‌లో తొలి కేసు గుర్తించిన దగ్గర నుంచి అగస్టు 10కి కరోనా బారిన పడిన వారి సంఖ్య 2 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి అత్యంత వేగంగా వ్యాపిస్తున్నది. ఆదివారం రాత్రి 1,99,22,762 కేసులు ఉండగా… సోమవారం ఉదయం 10 గంటలకు 2,00,26,161కి చేరుకుంది.
ఇప్పటి వరకు కరోనా బారిన పడి 7,31,747 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా మరణాల రేటు 3.7గా నమోదైంది. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు అమెరికా, బ్రెజిల్, ఇండియాలోనే నమోదవుతున్నాయి. ప్రస్తుతం ఇండియాలో కేసుల సంఖ్య 22 లక్షలు దాటిపోయింది. గత వారం రోజులుగా అమెరికా కంటే ఇండియాలోనే కేసులు అధికంగా నమోదవుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.
అమెరికాలో ఈ నెల 1 నుంచి 8వ తేదీ వరకు 3,84,089 మంది పాజిటివ్‌గా నిర్థారణ కాగా, ఇండియాలో 3,99,263 మందికి సోకింది. కరోనా కేసులు నమోదవుతున్నప్పటి నుంచి కేసుల నమోదులో అమెరికాను ఇండియా దాటడం ఇదే తొలిసారు. మరో రెండు నెలల పాటు ఇండియాలో కరోనా తీవ్రంగా విజృంభించనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.