Telugu Global
National

రమేష్ ఆస్పత్రి ఉన్నతోద్యోగుల అరెస్ట్‌

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో రమేష్ ఆస్పత్రి ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్‌లో మంటలు చెలరేగి పది మంది చనిపోయిన వ్యవహారంలో అరెస్ట్‌ల పర్వం మొదలైంది. రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్‌ ఆఫీసర్ కొడాలి రాజగోపాల్‌తో పాటు జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్‌, నైట్ మేనేజర్ వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాదానికి రమేష్ ఆస్పత్రి నిర్లక్షమే కారణమని విచారణలో తేలడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్‌ను నిర్వహించిన స్వర్ణ ప్యాలెస్‌ […]

రమేష్ ఆస్పత్రి  ఉన్నతోద్యోగుల అరెస్ట్‌
X

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో రమేష్ ఆస్పత్రి ఏర్పాటు చేసిన కోవిడ్ సెంటర్‌లో మంటలు చెలరేగి పది మంది చనిపోయిన వ్యవహారంలో అరెస్ట్‌ల పర్వం మొదలైంది. రమేష్ ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్‌ ఆఫీసర్ కొడాలి రాజగోపాల్‌తో పాటు జనరల్ మేనేజర్ కూరపాటి సుదర్శన్‌, నైట్ మేనేజర్ వెంకటేష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అగ్ని ప్రమాదానికి రమేష్ ఆస్పత్రి నిర్లక్షమే కారణమని విచారణలో తేలడంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు.

రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్‌ను నిర్వహించిన స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌కు అగ్నిమాపక శాఖ నుంచి ఎన్‌వోసీ కూడా లేదని విచారణలో తేలింది. విశాఖలో ప్రమాదాలు జరిగినప్పుడు సంస్థలను మూసివేయాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడెందుకు రమేష్ ఆస్పత్రి విషయంలో మాట్లాడడం లేదని వైసీపీ ప్రశ్నిస్తోంది.

విశాఖలో ప్రమాదాలు జరిగినప్పుడు నిజనిర్ధారణ కమిటీలు వేసిన చంద్రబాబు ఈ ఉదంతంపై ఎందుకు కమిటీ వేయడం లేదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఆస్పత్రి యజమాని రమేష్ చౌదరి టీడీపీ సైనికుడు కాబట్టి చంద్రబాబు మాట్లాడడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల వైద్యులతో చంద్రబాబు నిర్వహించిన జూమ్‌ కాన్ఫరెన్స్‌లో ఈ ఆస్పత్రి యజమాని రమేష్ చౌదరి కూడా పాల్గొన్నారు. ఆ జూమ్ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నివారణలో విఫలమయ్యాయి… అందుకు జనం తమ వద్దకు వస్తున్నారని రమేష్ చౌదరి వ్యాఖ్యానించారని శ్రీకాంత్ రెడ్డి గుర్తు చేశారు.

ప్రభుత్వాలు విఫలమయ్యాయని నీతులు చెప్పిన రమేష్ చౌదరి… కోవిడ్ సెంటర్లు నిర్వహించి లక్షలకు లక్షలు జనం నుంచి వసూలు చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 10 మంది మృతికి కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు.

First Published:  10 Aug 2020 1:19 PM IST
Next Story