Telugu Global
National

బాబు మౌనం వెనక మతలబు ఏంటి..?

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత చంద్రబాబు, టీడీపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రభుత్వం ఉదారంగా కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటిస్తే.. కంపెనీని కాపాడేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ పెడర్థాలు తీసింది. ఆ తర్వాత మరికొన్ని పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా బాబు, ఆయన అనుచరులు, అనుకూల మీడియా అంతా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. అసమర్థ ప్రభుత్వం అంటూ తీవ్రంగా విమర్శించింది. అలాంటి చంద్రబాబుకి విజయవాడ నడిబొడ్డున కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం అంత […]

బాబు మౌనం వెనక మతలబు ఏంటి..?
X

విశాఖలో ఎల్జీ పాలిమర్స్ ఘటన తర్వాత చంద్రబాబు, టీడీపీ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ప్రభుత్వం ఉదారంగా కోటి రూపాయలు నష్టపరిహారం ప్రకటిస్తే.. కంపెనీని కాపాడేందుకు కుట్రలు పన్నుతున్నారంటూ పెడర్థాలు తీసింది.

ఆ తర్వాత మరికొన్ని పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగిన తర్వాత కూడా బాబు, ఆయన అనుచరులు, అనుకూల మీడియా అంతా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసింది. అసమర్థ ప్రభుత్వం అంటూ తీవ్రంగా విమర్శించింది.

అలాంటి చంద్రబాబుకి విజయవాడ నడిబొడ్డున కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదం అంత తీవ్రమైనదిగా కనిపించలేదా. పదిమంది ప్రాణాలు అగ్నికి ఆహుతైతే.. దిగ్భ్రాంతి వ్యక్తం చేయడం మినహా, కనీసం యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కూడా ఎందుకు చెప్పలేకపోయారు.

రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం, అగ్నిప్రమాదం జరిగిన కోవిడ్ కేర్ సెంటర్ నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఎందుకు అడగలేదు. అప్పుడు ఎల్జీ పాలిమర్స్ తో వైసీపీ కుమ్మక్కై ఉంటే.. ఇప్పుడు రమేష్ హాస్పిటల్స్ కి కూడా వైసీపీ కొమ్ముకాయాలి కదా. ప్రతిపక్షంగా అన్నిటినీ రాద్ధాంతం చేస్తున్న టీడీపీకి ఈ ఉదంతం చిన్నదిగా కనిపించిందా? ఏకంగా ప్రధాని మోదీ ఈ ఘటనపై ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆరా తీయగా, చంద్రబాబు మాత్రం దిగ్బ్రాంతి కలిగింది అంటూ ట్వీట్ వేసి తప్పుకున్నారు.

ఈ ఘటనలో చంద్రబాబు మౌనం వ్యూహాత్మకమేనని రుజువవుతోంది. రమేష్ హాస్పిటల్స్ నిర్వాహకులు, స్వర్ణ ప్యాలెస్ యాజమాన్యం చంద్రబాబుకి కావాల్సినవారు. అందుకే ఆయన ఆ విషయంపై జాగ్రత్తగా వ్యవహరించారు. కేవలం విచారం వ్యక్తం చేసి సరిపెట్టారు. మిగతా టీడీపీ నేతల్ని కూడా నోరు మెదపనీయలేదు. చంద్రబాబు అనుకూల మీడియాకి కనీసం ఆస్పత్రి పేరుని హెడ్డింగ్ లో పెట్టడానికి కూడా చేతులు రాలేదు.

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వార్తని, ఎంతగా తొక్కిపెట్టాలో అంతా చేశారు. మిగతా దుర్ఘటనలపై నిందలు వేయడానికి ముందుకొచ్చే చంద్రబాబు, తనకి కావాల్సినవారు తప్పుచేస్తే మాత్రం మౌనాన్ని ఆశ్రయించారు. ఇదెక్కడి రాజకీయం. అంటే ప్రజలపై ప్రతిపక్ష టీడీపీకి ప్రేమలేదు. గతంలో చేసిన రాద్ధాంతం కూడా కేవలం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికేనని అర్థమవుతోంది.

కొవిడ్ కేర్ సెంటర్ అగ్నిప్రమాదం విషయంలో చంద్రబాబు తన కుటిలత్వాన్ని మరోసారి బైటపెట్టుకున్నారు. ప్రభుత్వానికి ఎల్జీ పాలిమర్స్ అయినా ఒకటే, రమేష్ హాస్పిటల్స్ అయినా ఒకటే.. అందుకే విచారణకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రి, హోటల్ యాజమాన్యాలపై చట్టపరమైన చర్యలకు ఉపక్రమించారు.

First Published:  10 Aug 2020 4:21 PM IST
Next Story