Telugu Global
National

నిన్న అన్న... ఈరోజు తమ్ముడు... వీర్రాజు వ్యూహం ఏంటి?

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు వరుస భేటీలు రాష్ట్రంలో రాజకీయంగా సంచలనంగా మారాయి. రాజకీయాలకు దూరంగా, రాజకీయ నాయకులకు దూరంగా ఉంటున్న చిరంజీవిని కూడా ఇంటికి వెళ్లి మరీ కలసి వచ్చారు వీర్రాజు. లాక్ డౌన్ టైమ్ లో చిరంజీవి ఎవరినీ తన ఇంటికి ఆహ్వానించడంలేదు. ఆమధ్య సినిమా షూటింగ్ పర్మిషన్ల కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడానికి బైటకొచ్చారు కానీ, ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు చిరంజీవి. అలాంటిది బీజేపీ రాష్ట్ర […]

నిన్న అన్న... ఈరోజు తమ్ముడు... వీర్రాజు వ్యూహం ఏంటి?
X

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు వరుస భేటీలు రాష్ట్రంలో రాజకీయంగా సంచలనంగా మారాయి. రాజకీయాలకు దూరంగా, రాజకీయ నాయకులకు దూరంగా ఉంటున్న చిరంజీవిని కూడా ఇంటికి వెళ్లి మరీ కలసి వచ్చారు వీర్రాజు.

లాక్ డౌన్ టైమ్ లో చిరంజీవి ఎవరినీ తన ఇంటికి ఆహ్వానించడంలేదు. ఆమధ్య సినిమా షూటింగ్ పర్మిషన్ల కోసం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవడానికి బైటకొచ్చారు కానీ, ఆ తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు చిరంజీవి.

అలాంటిది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోము వీర్రాజు ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు ఇంటికెళ్లి కలసి వచ్చారు. తమ్ముడు జనసేనానితో కలసి పార్టీని అభివృద్ధి చేసుకోవాలని చిరంజీవి సూచించారని వీర్రాజు చెప్పారు.

అయితే ఇది సాధారణ భేటీ కాదని, దీని వెనక ఏదో కీలక శక్తి ఉందని ఊహించారంతా. కాపు సామాజిక వర్గాన్ని ఒకచోటకు చేర్చేందుకే వీర్రాజు రాజకీయాలకు దూరంగా ఉన్న చిరంజీవిని రంగంలోకి దింపారని అంటున్నారు. అయితే ఆ మరుసటి రోజే పవన్ కల్యాణ్ ని కూడా కలసిన వీర్రాజు రాజకీయంగా మరింత చర్చకు తావిచ్చారు.

మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎప్పుడూ పవన్ కల్యాణ్ కి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు లేవు. బీజేపీ, జనసేన పొత్తు తర్వాత జరిగిన సమావేశాల్లో కూడా కన్నా డామినేషన్ ఎక్కువగా కనిపించేది. కొన్ని సందర్భాల్లో జనసేన కార్యకర్తలు బీజేపీతో కలసి పనిచేయడానికి ఆసక్తి చూపించేవారు కాదు. కానీ వీర్రాజు మాత్రం భేషజాలు పక్కనపెట్టి నేరుగా చిరంజీవి, పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లి వారిని మర్యాదపూర్వకంగా కలసి వచ్చారు.

దీంతో అటు జనసైనికుల్లో కోలాహలం నెలకొంది. మొత్తమ్మీద ముద్రగడ పద్మనాభం అస్త్ర సన్యాసం తర్వాత కాపు సామాజిక వర్గాన్నంతటినీ ఒకచోటకు చేర్చేందుకు సోము వీర్రాజు ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే నిన్న చిరంజీవి, నేడు పవన్ కల్యాణ్ తో భేటీ అయిన ఆయన.. కాపు సామాజిక వర్గానికి ఓ కీలక సందేశాన్ని పంపించారు.

చిరంజీవిని ప్రత్యక్ష రాజకీయాల్లోకి తీసుకొచ్చే ఆలోచన లేకపోయినా.. రాష్ట్ర రాజకీయాల్లో కీలక సామాజిక వర్గాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం జోరందుకున్నాయని తెలుస్తోంది.

First Published:  7 Aug 2020 8:53 AM IST
Next Story