Telugu Global
International

ట్రంప్ వీడియోని బ్లాక్ చేసిన ట్విట్టర్, ఫేస్ బుక్!

‘కోవిడ్ 19 వైరస్ ని పిల్లలు చాలా సమర్ధవంతంగా ఎదుర్కొనగలరు’… అంటూ ఈ విషయంపై మాట్లాడిన ట్రంప్ వీడియోని ఫేస్ బుక్, ట్విట్టర్ బ్లాక్ చేశాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాలూకూ ఎన్నికలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతా ‘@ టీమ్ ట్రంప్’ ని కొన్నాళ్లపాటు కొత్తగా ట్వీట్లు చేయకుండా నిషేధం విధించింది ట్విట్టర్. ఫేస్ బుక్ సైతం ఈ వీడియోని తొలగించింది. కరోనా వైరస్ గురించి తమ ద్వారా తప్పుడు సమాచారం ప్రచారం కాకూడదనే తమ […]

ట్రంప్ వీడియోని బ్లాక్ చేసిన ట్విట్టర్, ఫేస్ బుక్!
X

‘కోవిడ్ 19 వైరస్ ని పిల్లలు చాలా సమర్ధవంతంగా ఎదుర్కొనగలరు’… అంటూ ఈ విషయంపై మాట్లాడిన ట్రంప్ వీడియోని ఫేస్ బుక్, ట్విట్టర్ బ్లాక్ చేశాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాలూకూ ఎన్నికలకు సంబంధించిన ట్విట్టర్ ఖాతా ‘@ టీమ్ ట్రంప్’ ని కొన్నాళ్లపాటు కొత్తగా ట్వీట్లు చేయకుండా నిషేధం విధించింది ట్విట్టర్. ఫేస్ బుక్ సైతం ఈ వీడియోని తొలగించింది.

కరోనా వైరస్ గురించి తమ ద్వారా తప్పుడు సమాచారం ప్రచారం కాకూడదనే తమ విధానానికి వ్యతిరేకంగా ట్రంప్ వీడియో ఉన్నందుకే అలా స్పందించాల్సి వచ్చిందని ట్విట్టర్ ప్రతినిధి పేర్కొన్నారు.

పిల్లల్లో రోగనిరోధక శక్తి చాలా బలంగా ఉంటుందని అందుకే కరోనా వైరస్ వారిని ఏమీ చేయలేదని…వారికి దాని వలన ఎలాంటి సమస్య ఉండదని ఫాక్స్ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ చెప్పుకొచ్చారు. స్కూల్స్ ని ప్రారంభించడం సబబే అని వాదిస్తూ ఈ అభిప్రాయాలను ఆయన వెల్లడించారు.

పిల్లల్లో పూర్తి స్థాయి ఇమ్యూనిటీ ఉంటుందని డాక్టర్లు చెప్పగా తాను విన్నానని ట్రంప్ తెలిపారు. ఇప్పుడే కాదు ట్రంప్ ఇంతకుముందు కూడా కోవిడ్ 19 చికిత్సలపై అవగాహన లేని వ్యాఖ్యలు చేశారు. వైరస్ బాధితులకు క్రిములను సంహరించే మందులను చికిత్సకోసం వాడవచ్చని గతంలో ట్రంప్ సూచించారు. కరోనా చికిత్సకు హైడ్రాక్సిక్లోరోక్విన్ ని వాడవచ్చంటూ సలహాలను ఇచ్చిన ట్రంప్ వీడియోని సైతం ట్విట్టర్, ఫేస్ బుక్ గతంలో బ్లాక్ చేశాయి.

First Published:  6 Aug 2020 12:38 PM IST
Next Story