బీజేపీ నుంచి ఓవీ రమణ సస్పెండ్
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వేట మొదలైంది. టీడీపీ నుంచి వచ్చిన కొందరు నేతలు బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. టీవీ చానళ్ల చర్చల్లో టీడీపీ వాదనను సమర్థిస్తూ అదే బీజేపీ ఆలోచన అన్నట్టుగా కొందరు బీజేపీ నేతలు మాట్లాడేవారు. అలాంటి వారిపై ఇటీవల బీజేపీ చర్యలు మొదలుపెట్టింది. టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ నాయకుడు ఓవీ రమణను ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మేరకు […]
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో వేట మొదలైంది. టీడీపీ నుంచి వచ్చిన కొందరు నేతలు బీజేపీలో ఉంటూ చంద్రబాబు కోసం పనిచేస్తున్నారన్న విమర్శలు చాలాకాలంగా ఉన్నాయి. టీవీ చానళ్ల చర్చల్లో టీడీపీ వాదనను సమర్థిస్తూ అదే బీజేపీ ఆలోచన అన్నట్టుగా కొందరు బీజేపీ నేతలు మాట్లాడేవారు. అలాంటి వారిపై ఇటీవల బీజేపీ చర్యలు మొదలుపెట్టింది.
టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ నాయకుడు ఓవీ రమణను ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఓవీ రమణ గత ఎన్నికల్లో తిరుపతి టీడీపీ టికెట్ కూడా ఆశించారు. కర్నాటక మాజీ సీఎం కుమార స్వామి ద్వారా రికమెండేషన్ చేయించారు. కానీ సాధ్యం కాలేదు. ఆ తర్వాత ఓవీ రమణ బీజేపీలో చేరారు. తాజాగా అమరావతి విషయంలో బీజేపీ వైఖరిని విమర్శిస్తూ ఒక పత్రికలో ఓవీ రమణ ఒక ఆర్టికల్ రాశారు.
మూడు ముక్కలాటలో బీజేపీ నష్టపోతోందంటూ ఆర్టికల్‌లో వ్యాఖ్యానించారు. మూడు రాజధానుల విషయంలో బీజేపీ నిర్ణయం తనలాంటి ఎందరినో ఖిన్నులను చేస్తోందని విమర్శించారు. బీజేపీ ఈ దోబుచులాటను ఎందుకు ఆడిస్తోందో అంతుచిక్కని చిదంబర రహస్యం అంటూ ఆరోపించారు.
అమరావతే రాజధానిగా ఉంటుందని తొలుత చెప్పి ఇప్పుడు పార్టీ వేరు కేంద్ర ప్రభుత్వం వేరు అంటూ సరికొత్త ప్రవచనాలు చెబుతున్నారంటూ సొంత పార్టీపైనే విమర్శలు చేస్తూ ఆర్టికల్ రాశారు ఓవీ రమణ. అధ్యక్షుడు అయిన తర్వాత సోమువీర్రాజు అమరావతిపై చేసిన వ్యాఖ్యలను కూడా ఓవీ రమణ తప్పుపడుతూ ఆర్టికల్ రాశారు. దీనిపై బీజేపీ నాయకత్వం చాలా సీరియస్ అయింది.