Telugu Global
National

రామమందిరం జాతి ఐక్యతకు ప్రతీక

రామమందిర నిర్మాణం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం అవుతుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. మందిర భూమిపూజ చేసిన అనంతరం మాట్లాడిన ప్రధాని… జైశ్రీరామ్ నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. దేశం మొత్తం రామమయమని ప్రధాని వ్యాఖ్యానించారు. రామమందిర భూమిపూజ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానన్నారు. భారత దేశ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం అన్నారు. దశాబ్దాల పాటు టెంట్‌లో ఉన్న రామ్‌లల్లా భవ్యమైన మందిరం రూపుదిద్దుకోబోతోందన్నారు. దశాబ్దాల నిరీక్షణకు తెరపడిందన్నారు. రామజన్మభూమి కోసం ఎన్నో తరాలు అవిశ్రాంత […]

రామమందిరం జాతి ఐక్యతకు ప్రతీక
X

రామమందిర నిర్మాణం దేశ చరిత్రలో సువర్ణ అధ్యాయం అవుతుందన్నారు ప్రధాని నరేంద్రమోడీ. మందిర భూమిపూజ చేసిన అనంతరం మాట్లాడిన ప్రధాని…
జైశ్రీరామ్ నినాదాలతో తన ప్రసంగాన్ని ప్రారంభించారు.

దేశం మొత్తం రామమయమని ప్రధాని వ్యాఖ్యానించారు. రామమందిర భూమిపూజ కార్యక్రమానికి తనను ఆహ్వానించడం పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నానన్నారు. భారత దేశ చరిత్రలో ఇదో సువర్ణ అధ్యాయం అన్నారు. దశాబ్దాల పాటు టెంట్‌లో ఉన్న రామ్‌లల్లా భవ్యమైన మందిరం రూపుదిద్దుకోబోతోందన్నారు. దశాబ్దాల నిరీక్షణకు తెరపడిందన్నారు.

రామజన్మభూమి కోసం ఎన్నో తరాలు అవిశ్రాంత పోరాటాన్ని కొనసాగించాయన్నారు. ఈ పోరాటంలో ఎన్నో బలిదానాలు జరిగాయన్నారు. ఆ పోరాటాల ఫలితంగానే నేడు ఆలయంలోకి రామ్‌లల్లా అని వ్యాఖ్యానించారు. రాముడు మర్యాదపురుషోత్తముడని ప్రధాని చెప్పారు. తమజీవిత కాలంలో రామమందిర కల నెరవేరుతుందని కోట్లాది మంది నమ్మలేకపోయారన్నారు.

రాముడి కార్యక్రమాలన్నీ హనుమంతుడే చేస్తారని ప్రధాని వ్యాఖ్యానించారు. ఆ హనుమంతుడి ఆశీర్వాదంతోనే నేడు రామమందిరానికి భూమిపూజ జరిగిందన్నారు. రామమందిరంకోసం జరిగిన పోరాటాన్ని స్వాతంత్ర్య ఉద్యమంతో ప్రధాని నరేంద్ర మోడీ పోల్చారు. రాముడు భారత దేశ మర్యాదకు చిహ్నమన్నారు. అయోధ్యలో రామాలయం జాతి ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. ఎవరి మనోభావాలకు ఇబ్బందిరాకుండా సుప్రీంకోర్టు శాంతియుత తీర్పును ఇచ్చిందన్నారు.

ప్రపంచంలోనే అత్యధికంగా ముస్లింలు ఉన్న ఇండోనేషియాలో ఇప్పటికీ రాముడికి పూజలు చేస్తుంటారని ప్రధాని మోడీ వివరించారు. మలేషియా, ఇరాన్‌లోనూ రామాయణ పఠనం జరుగుతోందన్నారు. ఆలయం పూర్తయితే అయోధ్య రూపురేఖలే మారిపోతాయన్నారు. ప్రపంచం నుంచి అనేక మంది ఇక్కడికి వస్తారన్నారు. రాముడు అందరి సంతోషాన్ని కోరుకుంటాడని… ఏ ఒక్కరిపైనా వివక్ష చూపకూడదన్నది శ్రీరాముడి సిద్ధాంతమన్నారు మోడీ.

First Published:  5 Aug 2020 9:16 AM IST
Next Story