అయోధ్యలో ఘనంగా రామమందిర భూమి పూజ
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించారు. కరోనా కారణంగా తక్కువ మంది వీఐపీల సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ భూమి పూజ చేశారు. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి హనుమంతుడి ఆలయంలో పూజలు చేశారు. రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను ప్రధాని నాటారు. రామమందిర భూమి పూజలో నక్షత్ర ఆకారంలో ఐదు వెండి ఇటుకలను వాడారు. అయోధ్య వచ్చిన […]
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా కార్యక్రమం నిర్వహించారు. కరోనా కారణంగా తక్కువ మంది వీఐపీల సమక్షంలో కార్యక్రమం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ భూమి పూజ చేశారు.
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ అక్కడి హనుమంతుడి ఆలయంలో పూజలు చేశారు. రామ్‌లల్లా దర్శనం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పారిజాత మొక్కను ప్రధాని నాటారు. రామమందిర భూమి పూజలో నక్షత్ర ఆకారంలో ఐదు వెండి ఇటుకలను వాడారు. అయోధ్య వచ్చిన మోడీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు.
అనంతరం జరిగిన సభలో ప్రసంగించిన యోగి ఆదిత్యనాథ్… ఐదు దశాబ్దాల కల సాకారం అవుతోందన్నారు. ఎందరో త్యాగాల ఫలితం నేడు నెరవేరుతోందన్నారు. ప్రజాస్వామ్యబద్దంగా, శాంతియుతంగా ఆలయ నిర్మాణ కల సాకారమైందన్నారు యోగి.
అందరూ ఈ వేదికపై లేకపోవచ్చని… కానీ అయోధ్య రామజన్మభూమి ఉద్యమంలో అద్వానీ పాత్ర ఎనలేనిది అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు.
ఆలయ నిర్మాణం వేగంగా సాగుతుందని ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్పారు. అన్ని ద్వేషాలు, పాపాల నుంచి దూరంగా స్వమానవ సమాజం కోసం ప్రయత్నించాలని కోరారు.