Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతి పెద్ద సినిమా ఇదే...

ఈ సంక్రాంతికి ఎన్టీఆర్-చరణ్ కలిసి చేస్తున్న ఆర్ఆర్ఆర్ రావట్లేదు. చిరంజీవి నటిస్తున్న ఆచార్య రావడం లేదు. రజనీకాంత్ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. పవన్ వకీల్ సాబ్ వచ్చే అవకాశాలు కూడా అంతంతమాత్రమే. మరి సంక్రాంతికి పెద్ద సినిమా లేదా? ఉంది.. ఈ సంక్రాంతికి అతిపెద్ద సినిమా వస్తోంది. అదే కేజీఎఫ్ ఛాప్టర్-2. బాహుబలి తర్వాత ఇండియా అంతటా హిట్టయిన సినిమా కేజీఎఫ్. ఇప్పుడా సినిమాకు ఛాప్టర్-2 వస్తోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని […]

సంక్రాంతి పెద్ద సినిమా ఇదే...
X

ఈ సంక్రాంతికి ఎన్టీఆర్-చరణ్ కలిసి చేస్తున్న ఆర్ఆర్ఆర్ రావట్లేదు. చిరంజీవి నటిస్తున్న ఆచార్య రావడం లేదు. రజనీకాంత్ సినిమా కూడా పోస్ట్ పోన్ అయింది. పవన్ వకీల్ సాబ్ వచ్చే అవకాశాలు కూడా అంతంతమాత్రమే. మరి సంక్రాంతికి పెద్ద సినిమా లేదా?

ఉంది.. ఈ సంక్రాంతికి అతిపెద్ద సినిమా వస్తోంది. అదే కేజీఎఫ్ ఛాప్టర్-2. బాహుబలి తర్వాత ఇండియా అంతటా హిట్టయిన సినిమా కేజీఎఫ్. ఇప్పుడా సినిమాకు ఛాప్టర్-2 వస్తోంది. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని ప్రకటించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.

కేజీఎఫ్ ఛాప్టర్-2కు సంబంధించి ఇప్పటికే 90శాతం షూటింగ్ పూర్తయింది. మిగిలిన 10శాతం షూటింగ్ ను ఈనెల 15 నుంచి ప్రారంభించబోతున్నట్టు యూనిట్ తెలిపింది. సినిమాలో పెద్దగా గ్రాఫిక్ వర్క్ కూడా లేకపోవడంతో.. సంక్రాంతికి రావడం పక్కా అనే విషయాన్ని యూనిట్ స్పష్టంచేసింది.

సో.. వచ్చే ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమా కేజీఎఫ్ ఛాప్టర్-2 మాత్రమే.

First Published:  5 Aug 2020 6:00 AM IST
Next Story