మెగాస్టార్ బర్త్ డే కానుక రెడీ
చిరంజీవి పుట్టినరోజుకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఈనెల 22న తన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మెగాస్టార్. ఈ పుట్టినరోజుకు లూసిఫర్ రీమేక్ ప్రకటన వస్తుందని కొందరు అంటున్నారు. మరికొందరు చిరంజీవి-బాబి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ప్రకటన వస్తుందని అంటున్నారు. ఇవేవీ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు కానీ ఆచార్య ఫస్ట్ లుక్ మాత్రం పక్కా అయింది. అవును.. చిరు పుట్టినరోజుకు ఆచార్య సినిమా నుంచి చిరంజీవి ఫస్ట్ లుక్ ను […]

చిరంజీవి పుట్టినరోజుకు కౌంట్ డౌన్ షురూ అయింది. ఈనెల 22న తన బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు మెగాస్టార్. ఈ పుట్టినరోజుకు లూసిఫర్ రీమేక్ ప్రకటన వస్తుందని కొందరు అంటున్నారు. మరికొందరు చిరంజీవి-బాబి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ప్రకటన వస్తుందని అంటున్నారు.
ఇవేవీ ఇంకా కన్ ఫర్మ్ కాలేదు కానీ ఆచార్య ఫస్ట్ లుక్ మాత్రం పక్కా అయింది. అవును.. చిరు పుట్టినరోజుకు ఆచార్య సినిమా నుంచి చిరంజీవి ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. ఇది పక్కా.
ఈ మూవీకి సంబంధించి ఆచార్య అనే టైటిల్ ను చిరంజీవి అనుకోకుండా బయటపెట్టేశారు. లేదంటే టైటిల్ ఎనౌన్స్ మెంట్ ను గ్రాండ్ గా చేయాలనుకున్నారు. అనుకోకుండా చిరు నోటి నుంచి టైటిల్ వచ్చేయడంతో, ఇక ఫస్ట్ లుక్ ఒక్కటే మిగిలింది. ఆ ముచ్చట ఈ నెల 22న తీరబోతోంది. కొరటాల శివ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. కాజల్ హీరోయిన్.