గంటలు లెక్కపెట్టుకుంటున్న చంద్రబాబు...
48గంటల్లో వైసీపీ నేతలంతా రాజీనామా చేయలేదో.. ఆ తర్వాత నేనేంటో చూపిస్తానన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు. ఇంతకీ 48గంటల తర్వాత ఏమవుతుంది. వైసీపీ నేతలతో సహా టీడీపీ నేతల్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏదో ఫ్లోలో రెండు రోజుల డెడ్ లైన్ పెట్టారా? లేక ఏదైనా కుట్ర మనసులో పెట్టుకుని రాజీనామా చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారా? అసలేంటి చంద్రబాబు స్ట్రాటజీ. బలవంతులు హెచ్చరిస్తే.. దానికో అర్థముంది. మరి చంద్రబాబు లాంటి వ్యక్తి విసిరిన సవాల్ […]
48గంటల్లో వైసీపీ నేతలంతా రాజీనామా చేయలేదో.. ఆ తర్వాత నేనేంటో చూపిస్తానన్నారు ప్రతిపక్ష నేత చంద్రబాబు.
ఇంతకీ 48గంటల తర్వాత ఏమవుతుంది. వైసీపీ నేతలతో సహా టీడీపీ నేతల్ని వేధిస్తున్న ప్రశ్న ఇది. ఏదో ఫ్లోలో రెండు రోజుల డెడ్ లైన్ పెట్టారా? లేక ఏదైనా కుట్ర మనసులో పెట్టుకుని రాజీనామా చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలను డిమాండ్ చేశారా? అసలేంటి చంద్రబాబు స్ట్రాటజీ. బలవంతులు హెచ్చరిస్తే.. దానికో అర్థముంది. మరి చంద్రబాబు లాంటి వ్యక్తి విసిరిన సవాల్ లో అంతరార్థమేముంది.
తనతోపాటు 23మంది ఎమ్మెల్యేలు, గట్టిగా అదిలిస్తే.. అందులో ఎంతమంది ఉంటారో ఎంతమంది వెళ్లిపోతారో తెలియని పరిస్థితి. ఎన్నికలకు మూడున్నరేళ్లకు పైగా సమయం. బలంగా ఉన్న వైరి పక్షం, రోజురోజుకీ బలహీనమవుతున్న స్వపక్షం. చేతికి అందిరాని వారసుడు, తప్పించుకు తిరుగుతున్న అనుచరగణం. ఇవన్నీ ఉన్న చంద్రబాబు నిజంగా పూర్తి బలహీనుడు.
అలాంటి చంద్రబాబు డెడ్ లైన్ పెట్టారంటే దాని అర్థం ఏంటి? వాస్తవానికి చంద్రబాబు మనసులో ఎలాంటి ఆలోచనా ఉండకపోవచ్చు. రెండు రోజులు ఈ వివాదాన్ని కొనసాగించడానికి మాత్రమే డెడ్ లైన్ పెట్టి తమాషా చూస్తుండవచ్చు. ఈ రెండు రోజుల్లో రాష్ట్రం తలకిందులవదు, మూడు రాజధానుల విషయంలో ఎవరూ ఆందోళనలకు దిగరు, కేంద్రం జోక్యం చేసుకునే ప్రశ్నే లేదు, న్యాయస్థానాలు కూడా చట్టబద్ధంగా జరిగిన ప్రక్రియలో తలదూర్చాలనుకోవు.
ఇవన్నీ తెలుసు కాబట్టే చంద్రబాబు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏంచేయాలో తెలియక వైసీపీకి గడువిచ్చి సైలెంట్ గా ఉన్నారు. నమ్మించి నట్టేట ముంచారంటూ అమరావతి రైతులు చంద్రబాబుపై మండిపడుతున్న వేళ, వారి ఆగ్రహ జ్వాలల్ని కాస్త చల్లబరచాలంతే. ఈ గడువు తర్వాత బాబు బైటకొచ్చి ఏంచేస్తారు. కరోనా భయంతో ఎలాగూ జనాల్లోకి రాలేరు, ఉత్తర కుమారుడి నాయకత్వం ఎలా ఉంటుందో ఈపాటికే జనం చూశారు.
ఇక బాబు చేయగలిగిందేంటి? రాష్ట్ర ప్రజల్ని రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకురావడం అంత సులభమా. అయినా అమరావతికోసం ఉత్తరాంధ్రవాసులు, రాయలసీమ వాసులు ఎందుకు బైటకు రావాలి, రాయలసీమ వాసులు మాకు న్యాయరాజధాని వద్దంటూ ఎందుకు గొడవలు చేస్తారు? ఇవన్నీ జరిగే పనేనా? అందుకే చంద్రబాబు గంటలు లెక్కబెట్టుకుంటూ కాలం గడుపుతున్నారు.
48గంటలు తర్వాత మరోసారి జూమ్ యాప్ ద్వారా బైటకొచ్చి బేలమొహం వేస్తారంతే. ఓడిపోతారనే భయంతోనే వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదనే చెత్త లాజిక్ తో కాలం గడపాల్సిందే.