సుశాంత్ చనిపోయే ముందు గూగుల్ లో....!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో పాటు అతని కేసు విచారణలో వెలుగు చూస్తున్న విషయాలు సైతం సంచలనం రేపుతున్నాయి. సుశాంత్ సింగ్ మానసిక సమస్యల కారణంగానే మరణించాడన్న సంగతి తెలిసిందే. అతను మరణానికి కొన్ని నెలల ముందునుండి బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధికి మందులు వాడుతున్నట్టుగా వైద్యులు వెల్లడించారని ముంబయి పోలీసులు తెలిపారు. సుశాంత్ సింగ్ తన మేనేజర్ దిశా సలైన్ పేరుని, తను ఎదుర్కొంటున్న మానసిక వ్యాధి గురించి గూగుల్ […]
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో పాటు అతని కేసు విచారణలో వెలుగు చూస్తున్న విషయాలు సైతం సంచలనం రేపుతున్నాయి. సుశాంత్ సింగ్ మానసిక సమస్యల కారణంగానే మరణించాడన్న సంగతి తెలిసిందే. అతను మరణానికి కొన్ని నెలల ముందునుండి బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధికి మందులు వాడుతున్నట్టుగా వైద్యులు వెల్లడించారని ముంబయి పోలీసులు తెలిపారు.
సుశాంత్ సింగ్ తన మేనేజర్ దిశా సలైన్ పేరుని, తను ఎదుర్కొంటున్న మానసిక వ్యాధి గురించి గూగుల్ లో పదేపదే సెర్చ్ చేశాడని, ఆత్మహత్యకు కొన్నిగంటల ముందు తన పేరుని సైతం గూగుల్ లో సెర్చ్ చేశాడని పోలీసులు వెల్లడించారు. అతని ఫోన్, లాప్ టాప్ ద్వారా ఈ వివరాలు తెలిశాయని వారు తెలిపారు. దిశ ఆత్మహత్యతో తనకు సంబంధం ఉందనుకునే అవకాశం ఉందని… అతను ఆందోళనకు గురయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
సుశాంత్ బైపోలార్ డిజార్డర్ అనే మానసిక సమస్యకు మందులు వాడుతున్నాడని తమ విచారణలో తేలిందని… అయితే సుశాంత్ ఆత్మహత్యకు దారితీసిన అంశాలేమిటో తేలాల్సి ఉందని ముంబయి పోలీస్ చీఫ్ పరమ్ వీర్ సింగ్ అన్నారు. సోషల్ మీడియాలో వస్తున్నట్టుగా ఏ పార్టీకి చెందిన ఏ రాజకీయ నాయకుడికీ సుశాంత్ ఆత్మహత్య కేసుతో సంబంధం లేదని ఆయన తెలిపారు.
సుశాంత్ సింగ్ కుటుంబం నటి రియా చక్రవర్తిపై పెట్టిన కేసు గురించి, సుశాంత్ బ్యాంక్ ఎకౌంట్ నుండి మరో ఖాతాకి 15 కోట్ల రూపాయలను తరలించడం గురించి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సైతం పరమ్ వీర్ సింగ్ సమాధానం చెప్పారు. అతని బ్యాంకు ఖాతాలో 18 కోట్ల రూపాయల డబ్బు ఉన్నట్టుగా తమ పరిశోధనలో తేలిందని, అందులో 4.5 కోట్లు మాత్రమే మిగిలి ఉందని, అయితే నేరుగా రియా ఖాతాకు డబ్బు తరలించినట్టుగా ఆధారాలు లేవని… తమ విచారణ కొనసాగుతోందని సింగ్ వెల్లడించారు.