Telugu Global
National

సీమ టీడీపీ నేతల కొత్త రాగం

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ న్యాయవాదులు వెళ్లి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే జిల్లాకో హైకోర్టు పెడుతారా? అని చీదరించుకుని పంపించారు చంద్రబాబు. అనంతపురం జిల్లాకు దక్కాల్సిన ఎయిమ్స్‌ను అమరావతికి తరలించారు. కానీ నాడు ఏ సీమ టీడీపీ నేత ఇది అన్యాయం అని మాట్లాడలేదు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించగానే టీడీపీ నేతలు కొత్త డిమాండ్‌తో బయలుదేరారు. ”న్యాయ రాజధానిగా ప్రకటించినంత మాత్రాన రాయలసీమకు ఒరిగేది ఏమీ లేదు. కర్నూలును […]

సీమ టీడీపీ నేతల కొత్త రాగం
X

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రాయలసీమ న్యాయవాదులు వెళ్లి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలంటే జిల్లాకో హైకోర్టు పెడుతారా? అని చీదరించుకుని పంపించారు చంద్రబాబు. అనంతపురం జిల్లాకు దక్కాల్సిన ఎయిమ్స్‌ను అమరావతికి తరలించారు.

కానీ నాడు ఏ సీమ టీడీపీ నేత ఇది అన్యాయం అని మాట్లాడలేదు. ఇప్పుడు జగన్‌మోహన్ రెడ్డి కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని ప్రకటించగానే టీడీపీ నేతలు కొత్త డిమాండ్‌తో బయలుదేరారు.

”న్యాయ రాజధానిగా ప్రకటించినంత మాత్రాన రాయలసీమకు ఒరిగేది ఏమీ లేదు. కర్నూలును పూర్తి రాజధానిగా ప్రకటించాలి.” అని నంద్యాల టీడీపీ ఎమ్మెల్సీ ఫరూక్‌ డిమాండ్ చేస్తున్నారు.

” కర్నూలుకు న్యాయ రాజధాని వచ్చేది ఏంది. పోయేదేందీ?. మహా అయితే నాలుగు జిరాక్స్ సెంటర్లు, పది మందికి ఉద్యోగాలు వస్తాయే తప్ప రాయలసీమకు ఒరిగేదేమీ లేదు.” ఇది ఏరాసు ప్రతాప్ రెడ్డి ప్రకటన.

”న్యాయ రాజధానిగా కర్నూలును ప్రకటించడంపై వైసీపీ నేతల సంబరాలు అల్ప సంతోషం. కర్నూలును పరిపాలన రాజధానిగా ప్రకటించాలి. నీటి వాటా కోసం పోరాటం చేయాలి” అని డోన్ టీడీపీ ఇన్‌చార్జ్‌ కేఈ ప్రతాప్ వ్యాఖ్యానించారు.

చంద్రబాబు ఉన్నప్పుడు రాయలసీమకు ఏమీ చేయకపోయినా నోరెత్తని ఈ టీడీపీ నేతలు… ఇప్పుడు మాత్రం పరిపాలన రాజధానిగా కర్నూలును చేయాలని డిమాండ్ చేయడం విచిత్రమే. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు టీడీపీనేతల చేత చంద్రబాబు ఆడిస్తున్న నాటకంగా చాలా మంది భావిస్తున్నారు.

First Published:  3 Aug 2020 7:20 AM GMT
Next Story