అమరావతిలో నా ప్రమేయం లేదు... టీడీపీ, వైసీపీనే నిలదీయండి...
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించారు. ఒక లేఖను విడుదల చేశారు. అమరావతి విషయంలో రైతులు ప్రశ్నించాల్సింది టీడీపీ, వైసీపీనే అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో ఆది నుంచి ఇప్పటి వరకు జనసేన ప్రమేయం ఏమాత్రం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తప్పు చేసింది టీడీపీ, వైసీపీనే అని కాబట్టి ఆ రెండు పార్టీలనే నిలదీయాలని రైతులకు సూచించారు. రైతుల పక్షాన జనసేన నిలబడుతుందని చెప్పారు. లక్ష […]
మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో పవన్ కల్యాణ్ స్పందించారు. ఒక లేఖను విడుదల చేశారు. అమరావతి విషయంలో రైతులు ప్రశ్నించాల్సింది టీడీపీ, వైసీపీనే అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అమరావతి విషయంలో ఆది నుంచి ఇప్పటి వరకు జనసేన ప్రమేయం ఏమాత్రం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
తప్పు చేసింది టీడీపీ, వైసీపీనే అని కాబట్టి ఆ రెండు పార్టీలనే నిలదీయాలని రైతులకు సూచించారు. రైతుల పక్షాన జనసేన నిలబడుతుందని చెప్పారు. లక్ష కోట్లతో రాజధాని నిర్మిస్తామని టీడీపీ చెప్పినప్పుడు గానీ, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని వైసీపీ చెప్పినప్పుడు గానీ వీటిలో జనసేన ప్రమేయం ఎక్కడుందని జనసేన నిలదీసింది.
బీజేపీ పెద్దలతో మాట్లాడినప్పుడు కూడా అమరావతే రాజధానిగా ఉంటుందని గతంలో తనతో చెప్పారన్నారు. 2014లో మోడీని కలిసినప్పుడు ఏపీకి రాజధాని లేదని గుర్తు చేశానని… అందుకు ఆయన గుజరాత్ ఏర్పడిన సమయంలో ఆ రాష్ట్రానికి కూడా రాజధాని లేదని… క్రమంగా అభివృద్ధిచేసుకుంటూ వెళ్లానని సూచించారన్నారు. హంగులు ఆర్భాటాలకు వెళ్లకుండా క్రమపద్దతిలో రాజధాని నిర్మించుకోండి అని నాడు మోడీ సూచించారన్నారు పవన్ కల్యాణ్.
తొలుత 2500 ఎకరాలు రాజధానికి చాలన్న టీడీపీ ప్రభుత్వం దాన్ని 30వేల ఎకరాలు, 40వేల ఎకరాలు అంటూ పెంచుకుంటూ పోయిందని పవన్ విమర్శించారు. భూములు ఇవ్వని వారిపై బలప్రయోగం చేసిందని గుర్తు చేశారు. రైతుల కన్నీటిపై రాజధాని నిర్మాణం మంచిది కాదని తాను తొలి నుంచి చెబుతూ వచ్చానన్నారు.
ఏ పార్టీ వచ్చినా రాజధాని తరలిపోదన్న నమ్మకంతోనే రైతులు భూములు ఇచ్చారని… ఇప్పుడు టీడీపీ, వైసీపీ కలిసి రైతుల బతుకులను చిద్రం చేశాయని పవన్ విమర్శించారు. రాజధాని వికేంద్రీకరణపై న్యాయ నిపుణులతో చర్చించి జనసేన ముందుకెళ్తుందని పవన్ కల్యాణ్ ప్రకటించారు.