తమన్న ఇలా ఇరుక్కుపోయింది ఏంటబ్బా!
డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే దానికి ప్రచారం చేస్తే ఇలానే ఉంటుంది. తమన్న ఇప్పుడు అలాంటి ప్రచారమే చేసి చిక్కుల్లో పడింది. రీసెంట్ గా అందరం టీవీల్లో ఓ యాడ్ చూస్తూనే ఉన్నాం. అందులో తమన్న, విరాట్ కోహ్లి కలిసి ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ కు ప్రచారం కల్పిస్తున్నారు. ఆన్ లైన్ లో గేమ్ ఆడండి, కళ్లు చెదిరే డబ్బులు సంపాదించండి అనేది దాని కాన్సెప్ట్. కానీ నిజానికి అదొక గ్యాంబ్లింగ్ […]
డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే దానికి ప్రచారం చేస్తే ఇలానే ఉంటుంది. తమన్న ఇప్పుడు అలాంటి ప్రచారమే చేసి చిక్కుల్లో పడింది. రీసెంట్ గా అందరం టీవీల్లో ఓ యాడ్ చూస్తూనే ఉన్నాం. అందులో తమన్న, విరాట్ కోహ్లి కలిసి ఓ ఆన్ లైన్ వెబ్ సైట్ కు ప్రచారం కల్పిస్తున్నారు. ఆన్ లైన్ లో గేమ్ ఆడండి, కళ్లు చెదిరే డబ్బులు సంపాదించండి అనేది దాని కాన్సెప్ట్.
కానీ నిజానికి అదొక గ్యాంబ్లింగ్ గేమ్. అలాంటి జూదానికి తమన్న ప్రచారం చేయడం తప్పు అంటున్నాడు యాక్టివిస్ట్ కమ్ లాయర్ ఏపీ సూర్యప్రకాషం. చెన్నైకు చెందిన ఈ న్యాయవాది హైకోర్టులో దీని మీద ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) వేశారు.
యువతను తప్పుదోవ పట్టిస్తూ, వాళ్ల జీవితాలతో ఆడుకుంటున్న ఇలాంటి ఆన్ లైన్ గ్యాంబ్లింగ్ సైట్స్ ను నిషేధించాలని ఆయన తన పిల్ లో కోరారు. అంతేకాదు, ఇలాంటి వాటికి ప్రచారం కల్పిస్తున్న తమన్న, కోహ్లి లాంటి ప్రముఖుల్ని కూడా విచారించాలని ఆయన అందులో డిమాండ్ చేశారు.
సూర్యప్రకాషం వేసిన పిల్ ను హైకోర్టు స్వీకరించింది. రేపు దీనిపై విచారణను చేపట్టనుంది. సో.. తమన్న, కోహ్లిని దీనిపై హైకోర్టు వివరణ అడిగే అవకాశం ఉంది.