Telugu Global
Cinema & Entertainment

ఈసారి సంక్రాంతి హీరోలు వీళ్లే

కరోనా వచ్చి హీరోల ప్లాన్స్ అన్నీ మార్చేసింది. లెక్కప్రకారం సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కావాలి. దీంతోపాటు రజనీకాంత్ మూవీ ఒకటి రావాలి. మధ్యలో వస్తే మరో చిన్న సినిమా రావాలి. కానీ ఈ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. ఊహించని విధంగా చిన్న హీరోలకు ఈసారి సంక్రాంతి రేసులో చోటు దక్కింది. సంక్రాంతికి రాబోతున్నట్టు ఇప్పటికే నితిన్ ప్రకటించాడు. నితిన్ పెళ్లి సందర్భంగా రంగ్ దే టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ లోనే సంక్రాంతికి రిలీజ్ […]

tollywood hero
X

కరోనా వచ్చి హీరోల ప్లాన్స్ అన్నీ మార్చేసింది. లెక్కప్రకారం సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కావాలి. దీంతోపాటు రజనీకాంత్ మూవీ ఒకటి రావాలి. మధ్యలో వస్తే మరో చిన్న సినిమా రావాలి. కానీ ఈ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయి. ఊహించని విధంగా చిన్న హీరోలకు ఈసారి సంక్రాంతి రేసులో చోటు దక్కింది.

సంక్రాంతికి రాబోతున్నట్టు ఇప్పటికే నితిన్ ప్రకటించాడు. నితిన్ పెళ్లి సందర్భంగా రంగ్ దే టీజర్ రిలీజ్ చేశారు. ఆ టీజర్ లోనే సంక్రాంతికి రిలీజ్ అంటూ ప్రకటించేశారు. ఇప్పుడీ రేసులోకి అఖిల్ కూడా ఎంటరయ్యాడు. తాజాగా అఖిల్ నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా నుంచి ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. తాము కూడా సంక్రాంతికే వస్తామంటూ ఆ పోస్టర్ లో ప్రకటించారు.

వీళ్లతో పాటు శర్వానంద్ కూడా తను చేస్తున్న శ్రీకారం సినిమాను సంక్రాంతికి విడుదల చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఇలా పెద్ద హీరోల స్థానంలో సంక్రాంతి బరిలో చిన్న హీరోలు వచ్చిచేరారు.

ఆచార్య సంక్రాంతికి రాదు, ఆర్ఆర్ఆర్ సంక్రాంతికి రాదు, మహేష్ మూవీ సంక్రాంతికి సిద్ధం కాదు, రజనీకాంత్ సినిమా సమ్మర్ కు వాయిదాపడింది. ఇలా పెద్ద సినిమాలన్నీ తప్పుకోవడంతో చిన్న హీరోలు పెద్ద పండగ చేసుకోబోతున్నారు.

First Published:  1 Aug 2020 3:45 PM IST
Next Story