సుజనాకు బీజేపీ షాక్
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనాచౌదరికి బీజేపీ నాయకత్వం గట్టి షాక్ ఇచ్చింది. పదేపదే సుజనాచౌదరి మూడు రాజధానుల ఏర్పాటును కేంద్రం అడ్డుకుంటుందని… మూడు రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలో ఉండదు కేంద్ర పరిధిలోని అంశం అని చెబుతూ వచ్చారు. సోము వీర్రాజును ఏపీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తాజాగా గురువారం కూడా సుజనాచౌదరి అవే వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని… రాజధాని అంశం కేంద్రం పరిధిలోనే ఉందంటూ మీడియా […]
టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీ సుజనాచౌదరికి బీజేపీ నాయకత్వం గట్టి షాక్ ఇచ్చింది. పదేపదే సుజనాచౌదరి మూడు రాజధానుల ఏర్పాటును కేంద్రం అడ్డుకుంటుందని… మూడు రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలో ఉండదు కేంద్ర పరిధిలోని అంశం అని చెబుతూ వచ్చారు.
సోము వీర్రాజును ఏపీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత తాజాగా గురువారం కూడా సుజనాచౌదరి అవే వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని… రాజధాని అంశం కేంద్రం పరిధిలోనే ఉందంటూ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వ్యాఖ్యానించారు. సుజనా వ్యాఖ్యలను ఆ వెంటనే సోము వీర్రాజు ఖండించారు. మూడు రాజధానుల అంశం రాష్ట్ర పరిధిలోని అంశమేనని… కేంద్రం జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు.
బీజేపీ నాయకత్వం అంతటితో ఆగి ఉంటే సరిపెట్టుకోవచ్చు. నేరుగా ఏపీ బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సుజనాచౌదరి వ్యాఖ్యలను ఆ పార్టీ ఖండించింది. సుజనా చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను పోస్టు చేసి… రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలు పార్టీ విధానానికి విరుద్దమని ప్రకటించింది. సుజనా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ప్రకటించింది.
రాజధాని అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదని పార్టీ అధ్యక్షుడు సోమువీర్రాజు స్పష్టం చేశారని బీజేపీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.
రాజధాని విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంది అన్న బిజెపి ఎంపి శ్రీ @yschowdary గారి వ్యాఖ్య పార్టీ విధానానికి విరుద్ధం.
రాజధాని అమరావతిలోనే కొనసాగాలి కానీ ఈ విషయం కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదన్నదే బిజెపి విధానంగా అధ్యక్షులు శ్రీ @somuveerraju గారు స్పష్టం చేశారు. pic.twitter.com/4v2IF6Dare
— BJP ANDHRA PRADESH (@BJP4Andhra) July 31, 2020