మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదం
ఏపీ గవర్నర్ టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. రెండు బిల్లులను ఆమోదించినట్టు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. దాంతో మూడు రాజధానుల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విశాఖ పరిపాలన రాజధాని, న్యాయ రాజధానిగా కర్నూలుకు ఆమోద ముద్ర పడింది. అనేక మలుపులు తిరిగి ఎట్టకేలకు గవర్నర్ ఆమోద ముద్ర పడింది. నిమ్మగడ్డ నియామకం విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించిన టీడీపీ ఇప్పుడు షాక్‌కు గురైంది. […]
ఏపీ గవర్నర్ టీడీపీకి బిగ్ షాక్ ఇచ్చారు. సీఆర్‌డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. రెండు బిల్లులను ఆమోదించినట్టు గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. దాంతో మూడు రాజధానుల ఏర్పాటుకు లైన్ క్లియర్ అయింది. విశాఖ పరిపాలన రాజధాని, న్యాయ రాజధానిగా కర్నూలుకు ఆమోద ముద్ర పడింది. అనేక మలుపులు తిరిగి ఎట్టకేలకు గవర్నర్ ఆమోద ముద్ర పడింది.
నిమ్మగడ్డ నియామకం విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించిన టీడీపీ ఇప్పుడు షాక్‌కు గురైంది. ఈ రెండు బిల్లులను అడ్డుకునేందుకు టీడీపీ సర్వశక్తులూ ఒడ్డింది.
విశాఖ పరిపాలన రాజధాని కాకుండా, కర్నూలు న్యాయ రాజధాని కాకుండా ఉండేందుకు శాసనమండలిలో తనకున్న బలాన్ని వేదికగా చేసుకుని టీడీపీ అనేక ప్రయత్నాలు చేసింది. హైకోర్టులో పదేపదే పిటిషన్లు వేయించింది. అయినప్పటికీ గవర్నర్ రెండు బిల్లులను ఆమోదించేశారు. ఈ బిల్లులను ఆమోదించే ముందు గవర్నర్ న్యాయనిపుణులతో చర్చించారు.