అచ్చెంకు మళ్లీ చుక్కెదురు
ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడుకు మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. మంత్రిగా ఉన్నప్పుడు మందుల కొనుగోలు, ఇతర వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడినందుకు అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది. తనకు మొలలు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్ వేసి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికి చాలా రోజులవుతున్నా అచ్చెన్నాయుడు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రిలోనే సేద తీరుతున్నారు. అచ్చెన్నాయుడుతో పాటు ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను కూడా కొట్టివేసింది. ఇంకా మరికొందరు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని… […]
ఈఎస్‌ఐ కుంభకోణంలో అచ్చెన్నాయుడుకు మరోసారి చుక్కెదురైంది. ఆయన బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. మంత్రిగా ఉన్నప్పుడు మందుల కొనుగోలు, ఇతర వ్యవహారాల్లో అక్రమాలకు పాల్పడినందుకు అచ్చెన్నాయుడిని ఏసీబీ అరెస్ట్ చేసింది.
తనకు మొలలు ఉన్నాయంటూ కోర్టులో పిటిషన్ వేసి ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఇప్పటికి చాలా రోజులవుతున్నా అచ్చెన్నాయుడు మాత్రం ప్రైవేట్ ఆస్పత్రిలోనే సేద తీరుతున్నారు.
అచ్చెన్నాయుడుతో పాటు ఇతర నిందితుల బెయిల్ పిటిషన్లను కూడా కొట్టివేసింది. ఇంకా మరికొందరు నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉందని… కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఏసీబీ లాయర్లు వివరించారు.