Telugu Global
National

కేసులు పెరిగినా నిజాయితీగానే ఎదుర్కొంటాం...

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను చూసి భయపడవద్దన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో జగన్‌మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరీక్షలు తగ్గించి… రికార్డుల్లో కరోనా కేసుల సంఖ్యను తక్కువగా చూపే ప్రయత్నాలు చేయవచ్చని… కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం తొలి నుంచి ఈ విషయంలో నిజాయితీగానే పనిచేస్తోందన్నారు. కేసుల సంఖ్యకు భయపడి పరీక్షలు తగ్గించే ప్రభుత్వం తమది కాదన్నారు. వైరస్ సోకిన ప్రతి వ్యక్తికి వైద్యం అందించి కాపాడాలన్న లక్ష్యంతో […]

కేసులు పెరిగినా నిజాయితీగానే ఎదుర్కొంటాం...
X

ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను చూసి భయపడవద్దన్నారు సీఎం వైఎస్‌ జగన్‌. జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో జగన్‌మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా పరీక్షలు తగ్గించి… రికార్డుల్లో కరోనా కేసుల సంఖ్యను తక్కువగా చూపే ప్రయత్నాలు చేయవచ్చని… కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం తొలి నుంచి ఈ విషయంలో నిజాయితీగానే పనిచేస్తోందన్నారు.

కేసుల సంఖ్యకు భయపడి పరీక్షలు తగ్గించే ప్రభుత్వం తమది కాదన్నారు. వైరస్ సోకిన ప్రతి వ్యక్తికి వైద్యం అందించి కాపాడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కరోనా నుంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంత ఖర్చుకైనా ప్రభుత్వం వెనుకాడబోదన్నారు. దేశంలో రోజుకు 50వేల పరీక్షలు చేస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు.

తక్షణం గుర్తించి మెరుగైన వైద్యం అందించడం ద్వారా మరణాల రేటును తగ్గించేందుకే భారీగా పరీక్షలు చేస్తున్నామని… ఇందువల్ల కేసుల సంఖ్య పెరుగుతోందన్నారు. ప్రజలెవరూ కరోనా కేసుల సంఖ్యను చూసి భయపడవద్దన్నారు.

కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలను భయపెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని… దాన్ని తిప్పికొట్టాలని సీఎం సూచించారు. ఏం జరిగినా తమకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ధైర్యాన్ని ప్రజల్లో నింపేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

లక్షకు పైగా కేసులు నమోదు అయినప్పటికీ ఇప్పటికే వారిలో సగం మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని సీఎం వివరించారు. కొన్ని చోట్ల అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు కూడా ముందుకు రావడం లేదని… అలాంటి చోట ప్రభుత్వమే అంత్యక్రియలు నిర్వహిస్తుందని ముఖ్యమంత్రి తెలిపారు.

కరోనా నుంచి ప్రజలను రక్షించుకునే విషయంలో ప్రభుత్వం నిజాయితీగానే పనిచేస్తుందని… ఎంత ఖర్చు అయినా భరిస్తుందని… ఇప్పటికే ఆరోగ్య శ్రీలోకి చేర్చామని సీఎం గుర్తు చేశారు. వైరస్‌ బారినపడిన వారికి సొంత బిడ్డల తరహాలో వైద్యం అందించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని సీఎం చెప్పారు.

First Published:  28 July 2020 9:40 AM IST
Next Story