ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు... హైకమాండ్ పంపిన సిగ్నల్ అదేనా ?
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. వరుసగా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటిస్తున్న బీజేపీ అధిష్టానం… ఏపీ అధ్యక్షుడిని కూడా మార్చింది. కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించింది. కన్నా లక్ష్మీనారాయణను మారుస్తారని కొన్నాళ్లుగా ఊహగానాలు విన్పిస్తున్నాయి. ఎప్పుడైతే కన్నా చంద్రబాబు రూట్లోకి వెళ్లారో అప్పటినుంచే ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఈనాడు రామోజీరావును కలిసిన తర్వాత ఇక […]
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటన విడుదల చేశారు. వరుసగా పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటిస్తున్న బీజేపీ అధిష్టానం… ఏపీ అధ్యక్షుడిని కూడా మార్చింది. కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజుకు పగ్గాలు అప్పగించింది.
కన్నా లక్ష్మీనారాయణను మారుస్తారని కొన్నాళ్లుగా ఊహగానాలు విన్పిస్తున్నాయి. ఎప్పుడైతే కన్నా చంద్రబాబు రూట్లోకి వెళ్లారో అప్పటినుంచే ఆయన గ్రాఫ్ పడిపోయింది. ఈనాడు రామోజీరావును కలిసిన తర్వాత ఇక ఆయనపై అనుమానాలు పటాపంచాలు అయ్యాయి. పూర్తిగా తెలుగుదేశం లైన్‌లో ఆయన నడిచారు. దీంతో అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఆయనకు పలుమార్లు క్లాస్‌లు కూడా పీకింది. అయితే కన్నాలో మార్పు రాలేదు. దీంతో ఆయన్నే పూర్తిగా మార్చారు.
టీడీపీ నుంచి వచ్చి బీజేపీలో చేరిన నేతలకు కూడా ఇప్పుడు చెక్‌పెట్టినట్లే అనేది కొందరి మాట. సోమువీర్రాజు పూర్తిగా హైకమాండ్ లైన్‌లో నడిచే వ్యక్తి. సుజనా చౌదరి బ్యాచ్ ఇక పూర్తిగా కంట్రోల్‌లోకి వస్తారని చెబుతున్నారు. దీంతో పాటు ఏపీ బీజేపీలోత్వరలోనే పూర్తిగా మార్పులు వచ్చే పరిస్థితి ఉంది.
ఎమ్మెల్సీ మాధవ్ అధ్యక్ష రేసులో ఉన్నారని ఇంతకుముందు ప్రచారం జరిగింది. అయితే ఆయనకు పార్టీపై పూర్తి పట్టు లేకపోవడం… ఇతర అంశాలు కలిసి రాకపోవడం మైనస్‌గా మారినట్లు తెలుస్తోంది.
మొత్తానికి సోము వీర్రాజు ఎంపికతో అధిష్టానం రాష్ట్ర బీజేపీ నేతలకు గట్టి హెచ్చరికలు పంపింది. తమకు అన్నీ తెలుసునని… పార్టీ కోసం కష్టపడాలని సిగ్నల్స్ పంపిందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.