సెట్స్ పైకొచ్చిన పాయల్ రాజ్ పుత్
లాక్ డౌన్ నిబంధనలు కాస్త సడలించడంతో పాటు షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే నటీనటులు బయటకొస్తున్నారు. మనసులో కాస్త భయం ఉన్నప్పటికీ ధైర్యంగా కెమెరా ముందుకొస్తున్నారు. పెద్ద సినిమాలేవీ పట్టాలపైకి రాకపోయినా.. చిన్న సినిమాల షూటింగ్స్ నడుస్తున్నాయి. ఇందులో భాగంగా పాయల్ రాజ్ పుత్ కూడా సెట్స్ పైకొచ్చింది. దాదాపు 4 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ముఖానికి రంగేసుకుంది పాయల్ రాజ్ పుత్. లొకేషన్ లో కెమెరా ముందుకొచ్చింది. షూటింగ్ లో పాల్గొంది. […]

లాక్ డౌన్ నిబంధనలు కాస్త సడలించడంతో పాటు షూటింగ్స్ కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడంతో ఇప్పుడిప్పుడే నటీనటులు బయటకొస్తున్నారు. మనసులో కాస్త భయం ఉన్నప్పటికీ ధైర్యంగా కెమెరా ముందుకొస్తున్నారు. పెద్ద సినిమాలేవీ పట్టాలపైకి రాకపోయినా.. చిన్న సినిమాల షూటింగ్స్ నడుస్తున్నాయి. ఇందులో భాగంగా పాయల్ రాజ్ పుత్ కూడా సెట్స్ పైకొచ్చింది.
దాదాపు 4 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ముఖానికి రంగేసుకుంది పాయల్ రాజ్ పుత్. లొకేషన్ లో కెమెరా ముందుకొచ్చింది. షూటింగ్ లో పాల్గొంది. కాకపోతే ఆమె షూట్ చేసింది సినిమా కోసం కాదు. ఓ యాడ్ షూట్ కోసం పాయల్ ఇలా సెట్స్ పైకొచ్చింది.
షూటింగ్ సినిమా కోసమైనా, యాడ్ కోసమైనా నటీనటులు బయటకు రావడమే ఇప్పుడు గొప్ప విషయంగా మారింది. ఈ విషయంలో పాయల్.. మిగతా హీరోయిన్లకు ఆదర్శంగా నిలిచింది.