Telugu Global
National

సిప్లా నుంచి ఫవిపిరవిర్... హైదరాబాద్ నుంచి కూడా

కోవిడ్-19 చికిత్సలో కీలకంగా ఉపయోగిస్తున్న ఫవిపిరవిర్ ఔషధాన్ని సిప్లా త్వరలో మార్కెట్లోకి తీసుకొని రానుంది. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సంస్థ తక్కువ ఖర్చుతోనే అందించాలనే ఉద్దేశంతో ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. మన దగ్గర స్థానికంగానే లభ్యమయ్యే రసాయనాలతో ఔషధాన్ని అభివృద్ధి చేసి, దానికి సంబంధించిన సాంకేతికతను ముంబైకి చెందిన సిప్లా కంపెనీకి బదలాయించింది. తక్కువ వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో ఔషధాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని సీఎస్ఐఆర్-ఐఐసీఆర్ డైరెక్టర్ […]

సిప్లా నుంచి ఫవిపిరవిర్... హైదరాబాద్ నుంచి కూడా
X

కోవిడ్-19 చికిత్సలో కీలకంగా ఉపయోగిస్తున్న ఫవిపిరవిర్ ఔషధాన్ని సిప్లా త్వరలో మార్కెట్లోకి తీసుకొని రానుంది. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్) సంస్థ తక్కువ ఖర్చుతోనే అందించాలనే ఉద్దేశంతో ఈ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. మన దగ్గర స్థానికంగానే లభ్యమయ్యే రసాయనాలతో ఔషధాన్ని అభివృద్ధి చేసి, దానికి సంబంధించిన సాంకేతికతను ముంబైకి చెందిన సిప్లా కంపెనీకి బదలాయించింది. తక్కువ వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో ఔషధాన్ని ఉత్పత్తి చేయడానికి ఈ సాంకేతికత ఉపయోగపడుతుందని సీఎస్ఐఆర్-ఐఐసీఆర్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

ఈ ఫవిపిరవిర్ ఔషధం స్వల్ప నుంచి మధ్యస్థంగా కోవిడ్-19 లక్షణాలు ఉన్న రోగుల్లో మంచి ఫలితాన్ని ఇస్తున్నది. ప్రస్తుతం గ్లెన్‌మార్క్‌కు చెందిన ఫావిఫ్లూ మాత్రమే మార్కెట్లో లభ్యం అవుతున్నది. కానీ ఇది కాస్త ధర ఎక్కువే. దీంతో పలు కంపెనీలకు డీసీజీఐ అనుమతులు ఇచ్చింది.

హైదరాబాద్‌కు చెందిన అప్టిమస్ ఫార్మాకు ఈ ఫవిపిరవిర్ ఔషధం ఉత్పత్తి చేయడానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీఐజీ), తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (టీ-డీసీఏ) అనుమతులు మంజూరు చేశాయి. మరో వారం రోజుల్లోపు అప్టిమస్ సంస్థ ఫవిపిరవిర్ 200 ఎంజీ ట్యాబ్లెట్లను తయారు చేసి దేశీయ మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ట్యాబ్లెట్ల తయారీకి అప్టిమస్ ఫార్మాకు చెందిన అనుబంధ సంస్థ ఆప్ట్రిక్స్ ఫార్మా ఫవిపిరవిర ఏపీఐ తయారీకి అనుమతి పొందింది. దీంతో మాతృసంస్థ ఆప్టిమస్ ఔషధాలను ఉత్పత్తి చేయనుంది. వీరి ఉత్పత్తికి ఫావికోవిడ్ 200 అనే పేరు పెట్టారు.

అయితే ఈ ఔషధాలను సాధారణ మెడికల్ దుకాణాల్లో అమ్మరని, డాక్టర్ల సూచన మేరకు పరిమిత సంఖ్యలోనే అమ్మడానికి అనుమతులు ఇచ్చినట్లు తెలుస్తున్నది. కోవిడ్-19 బారిన పడిన రోగులు 14 రోజుల పాటు ఈ ఔషధాన్ని వాడాల్సి ఉంటుంది.

First Published:  25 July 2020 3:23 AM IST
Next Story