Telugu Global
Cinema & Entertainment

పూరి కొడుకును కూడా వదల్లేదుగా

ఈరోజు పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పుట్టినరోజు. కొడుకు పుట్టినరోజు కోసం పనిగట్టుకొని అర్థరాత్రి 12 గంటలకు శుభాకాంక్షలు చెప్పాడు పూరి. ఇక పూరితో కలిసి సినిమాలు నిర్మించే చార్మి కూడా ఆకాష్ పై తనకున్న ప్రేమను వ్యక్తంచేస్తూ శుభాకాంక్షలు చెప్పింది. అంతా బాగానే ఉంది. వాళ్లు వాళ్లు శుభాకాంక్షలు బాగానే చెప్పుకున్నారు. కానీ మధ్యలో ఆకాష్ చేసిన ఓ పని మాత్రం అతడ్ని ట్రోలింగ్ కు గురిచేసింది. తన పుట్టినరోజు వస్తోందని, దయచేసి ఎవ్వరూ లాక్ […]

పూరి కొడుకును కూడా వదల్లేదుగా
X

ఈరోజు పూరి జగన్నాధ్ కొడుకు ఆకాష్ పుట్టినరోజు. కొడుకు పుట్టినరోజు కోసం పనిగట్టుకొని అర్థరాత్రి 12 గంటలకు శుభాకాంక్షలు చెప్పాడు పూరి. ఇక పూరితో కలిసి సినిమాలు నిర్మించే చార్మి కూడా ఆకాష్ పై తనకున్న ప్రేమను వ్యక్తంచేస్తూ శుభాకాంక్షలు చెప్పింది. అంతా బాగానే ఉంది. వాళ్లు వాళ్లు శుభాకాంక్షలు బాగానే చెప్పుకున్నారు. కానీ మధ్యలో ఆకాష్ చేసిన ఓ పని మాత్రం అతడ్ని ట్రోలింగ్ కు గురిచేసింది.

తన పుట్టినరోజు వస్తోందని, దయచేసి ఎవ్వరూ లాక్ డౌన్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దని, తన బర్త్ డేను సెలబ్రేట్ చేయొద్దని ఫ్యాన్స్ కు విజ్ఞప్తి చేశాడు ఆకాష్. సరిగ్గా ఇక్కడే నెటిజన్లకు కాలింది. ఆకాష్ కు కూడా ఫ్యాన్స్, సెలబ్రేషన్స్ లాంటివి ఉంటాయా అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు.

మరికొంతమంది ఇంకో అడుగు ముందుకేసి.. “సరే ఆకాష్ బాబు సెలబ్రేషన్స్ చేయం, కానీ ఇంతకీ నీ పుట్టినరోజు ఎప్పుడు” అంటూ ఆటపట్టించారు. మహేష్, పవన్, ప్రభాస్ లాంటి హీరోలు ఇలాంటి ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తే బాగుంటుందని.. ఆకాష్ కూడా ఇలా చేయడం ఏంటనేది ఎక్కువ మంది నెటిజన్ల ప్రశ్న.

First Published:  25 July 2020 1:28 PM IST
Next Story