ఐన్ స్టీన్... చార్లీచాప్లిన్ ఏం మాట్లాడుకున్నారు?
ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్ స్టీన్, ప్రపంచ ప్రఖ్యాత హాస్య నటుడు, హాలీవుడ్ స్టార్ చార్లీ చాప్లిన్… వీరిద్దరూ ఒక సందర్భంలో కలిశారు. 1931వ సంవత్సరంలో ఈ అరుదైన సమావేశం జరిగింది. అయితే ఈ ఇద్దరు మహామహులు కలిసినప్పుడు వారు ఏం మాట్లాడుకుని ఉంటారు అనేది చాలా ఆసక్తిని కలిగించే విషయం కదా. నోబెల్ బహుమతి కమిటీ ఇన్ స్టాగ్రామ్ లో… నాడు ఆ ఇద్దరు ప్రముఖులు కలిసిన సందర్భం గురించి […]
ప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత ఆల్బర్ట్ ఐన్ స్టీన్, ప్రపంచ ప్రఖ్యాత హాస్య నటుడు, హాలీవుడ్ స్టార్ చార్లీ చాప్లిన్… వీరిద్దరూ ఒక సందర్భంలో కలిశారు. 1931వ సంవత్సరంలో ఈ అరుదైన సమావేశం జరిగింది. అయితే ఈ ఇద్దరు మహామహులు కలిసినప్పుడు వారు ఏం మాట్లాడుకుని ఉంటారు అనేది చాలా ఆసక్తిని కలిగించే విషయం కదా.
నోబెల్ బహుమతి కమిటీ ఇన్ స్టాగ్రామ్ లో… నాడు ఆ ఇద్దరు ప్రముఖులు కలిసిన సందర్భం గురించి వెల్లడిస్తూ ఓ పోస్ట్ చేసింది. అందులో నాటి విశేషాలను గుర్తు చేసుకుంది. ఆ పోస్టు లో ఉన్న వివరాలను బట్టి హాలీవుడ్ నటుల్లో ఐన్ స్టీన్ కలవాలని అనుకున్న ఏకైక వ్యక్తి చార్లీ చాప్లిన్. లాస్ ఏంజిల్స్ లో జరిగిన సిటీ లైట్స్ ప్రీమియర్ షోలో ఐన్ స్టీన్… చాప్లిన్ ని కలిశారు. అప్పటికే నోబెల్ బహుమతి పొంది ప్రపంచ ఖ్యాతిని పొంది ఉన్నారు ఐన్ స్టీన్. వారిద్దరి మధ్య సంభాషణ చాలా ఆహ్లాదకరంగా సాగిందని నోబెల్ బహుమతి కమిటీ ఇన్ స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ ని బట్టి అర్థమవుతోంది.
‘మీ నటనలో నాకు నచ్చేది ఏమిటంటే అందులో విశ్వజనీనత ఉంటుంది. మీరు ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా ప్రపంచం మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది’ అంటూ ఐన్ స్టీన్… చాప్లిన్ ని అభినందించారు. అందుకు సమాధానంగా చాప్లిన్…‘మీరన్నమాట నిజమే. కానీ మీ కీర్తి అంతకంటే గొప్పది. మీరు చెప్పేదాంట్లో ఒక్క మాట కూడా అర్థం కాకపోయినా ఈ ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఆరాధిస్తుంది’ అన్నారు.
వారిద్దరు ఒకరి గురించి ఒకరు వ్యక్తీకరించిన అభిప్రాయాలు నూటికి నూరుశాతం నిజం కదా. అవును… వారిలో ఒకరు మనసులను అద్భుతంగా స్పందింపచేసినవారు కాగా మరొకరు మెదడుశక్తిని అద్వితీయంగా ఆవిష్కరించినవారు. చాప్లిన్ మనసు అర్థమైనట్టుగా ఐన్ స్టీన్ మెదడు అర్థం కావటం కష్టమే కదా మరి.
View this post on InstagramA post shared by Nobel Prize (@nobelprize_org) on