Telugu Global
International

ఇటలీలో కరోనా తగ్గిందా? ప్రస్తుతం అక్కడేం జరుగుతోంది?

ఇటలీ కరోనాను ఓడించిందా? గత మార్చి నెలలో మనదేశంలో లాక్‌డౌన్‌ విధించినపుడు ఇటలీలో మరణమృదంగం వినిపించింది. ఇటలీ, స్పెయిన్‌ లలో లెక్కలేనన్ని కేసులు నమోదు అయ్యాయి. జనం పిట్టల్లా రాలుతున్నారని వార్తలు వచ్చాయి. మరీ ఇప్పుడు ఇటలీలో ఏం జరుగుతోంది? కరోనా అక్కడ తగ్గుముఖం పట్టిందా? ఇటలీలో ఇప్పటివరకూ 2 లక్షల 45వేలకు పైగా కరోనా కేసులు పాజిటివ్ గా‌ తేలాయి. ఇందులో లక్షా 98 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 12 వేలు […]

ఇటలీలో కరోనా తగ్గిందా? ప్రస్తుతం అక్కడేం జరుగుతోంది?
X

ఇటలీ కరోనాను ఓడించిందా? గత మార్చి నెలలో మనదేశంలో లాక్‌డౌన్‌ విధించినపుడు ఇటలీలో మరణమృదంగం వినిపించింది. ఇటలీ, స్పెయిన్‌ లలో లెక్కలేనన్ని కేసులు నమోదు అయ్యాయి. జనం పిట్టల్లా రాలుతున్నారని వార్తలు వచ్చాయి. మరీ ఇప్పుడు ఇటలీలో ఏం జరుగుతోంది? కరోనా అక్కడ తగ్గుముఖం పట్టిందా?

ఇటలీలో ఇప్పటివరకూ 2 లక్షల 45వేలకు పైగా కరోనా కేసులు పాజిటివ్ గా‌ తేలాయి. ఇందులో లక్షా 98 వేల మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 12 వేలు మాత్రమే. 35 వేల మంది వైరస్‌తో చనిపోయారు. కొత్త కేసులు కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టాయి. పదుల సంఖ్యలో మాత్రమే కేసులు నమోదు అవుతున్నాయి.

ఇటలీ రాజధాని మిలాన్‌లోని ఓ ఆసుపత్రిలో 500 బెడ్‌లు ఉంటే… కరోనా పంజా విసిరిన టైమ్‌లో 600 మంది చికిత్స పొందేవారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 40 నుంచి 50 శాతం మాత్రమే కరోనా బాధితులు ఉంటున్నారట. ఆసుపత్రిలో ఐసీయూ మొత్తం కరోనా రోగులకు కేటాయించారట.

ఓ పీడకల నుంచి బయటపడినట్లేనని… త్వరలోనే ఇటలీలో సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని అక్కడి డాక్టర్లు అంటున్నారు. గత మూడు వారాల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా తమ ఆసుపత్రికి రాలేదని ఓ డాక్టర్‌ చెప్పారు.

రాజధాని మిలాన్‌కు పక్కనే ఉన్న లాంబార్గిలో ఎక్కువగా వైరస్‌ వ్యాప్తి చెందింది. ఇటలీలో మొత్తం 35 వేల మంది చనిపోతే ఇందులో సగం ఈ ప్రాంతానికి చెందినవారే. ప్రస్తుతం ఈ ప్రాంతానికి చెందిన 41 మంది మాత్రమే ఐసీయూలో ఉన్నారు. 277 మంది వైరస్‌తో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం ఇక్కడ బయటకు వస్తే మాస్క్‌ తప్పనిసరి ధరించాలని నిబంధన‌ పెట్టారు. స్కూలు, యూనివర్శిటీలు తెరవలేదు. బార్లు, రెస్టారెంట్లు మాత్రమే ఓపెన్‌ చేశారు.

మొదట్లో లాక్‌డౌన్‌ విధించినపుడు ఇటలీ ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చింది. సోషల్‌ లైఫ్‌ను ఇష్టపడే అక్కడి జనాలు.. మొదట్లో పట్టించుకోలేదు. ఒక్కసారిగా కేసులు పెరగడం, మృతుల సంఖ్య రెట్టింపు అవడంతో ప్రజల్లో భయం మొదలైంది. అక్కడి నుంచి లాక్‌డౌన్ నిబంధనలను, ప్రభుత్వ సూచనలను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. సోషల్‌ డిస్టెన్స్‌ ఇప్పటికి కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పటికీ అక్కడి జనాలు పూర్థి స్థాయిలో బయటకు రావడం లేదట.

ఒకవేళ వైరస్ రెండోసారి పంజా విసిరినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని ఇటలీ అధికారులు అంటున్నారు. ఇప్పుడు వైరస్‌ను కట్టడి చేయడం ఎలా అనేది నేర్చుకున్నామని వివరిస్తున్నారు. రాబోయే చలికాలంలో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే ప్రజలకు అవగాహన కల్పించే పనిలో పడ్డారు.

మొత్తానికి రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదైన రోజు నుంచి… ఇప్పుడు 12 వేల యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉండటమంటే మాటలు కాదు. రాబోయే రోజుల్లో కొత్త కేసులు బయటపడకపోతే కరోనా నుంచి ఇటలీ బయటపడినట్లే అంటున్నారు.

First Published:  23 July 2020 2:00 PM IST
Next Story