Telugu Global
National

శ్రీశైలంకు భారీగా వరద

తెలుగు రాష్ట్రాల్లో గతేడాదిలాగే ఈసారి కూడా ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. జులై నెలలోనే ప్రాజెక్టులకు భారీగా నీరు వస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అధికంగా జులై నెలలో వర్షపాతం నమోదు అయింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తోంది. లక్షా 3వేల క్కూసెక్కుల ప్రవాహం ఎగువ నుంచి శ్రీశైలం డ్యాంకి వస్తోంది. శ్రీశైలం నుంచి దిగువకు 39వేల క్కూసెక్కుల నీటిని వదులుతున్నారు. దాంతో నాగార్జున సాగర్‌కు 38వేల […]

శ్రీశైలంకు భారీగా వరద
X

తెలుగు రాష్ట్రాల్లో గతేడాదిలాగే ఈసారి కూడా ప్రాజెక్టులకు భారీగా వరద వస్తోంది. జులై నెలలోనే ప్రాజెక్టులకు భారీగా నీరు వస్తోంది.

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇప్పటికే సాధారణ వర్షపాతం కంటే అధికంగా జులై నెలలో వర్షపాతం నమోదు అయింది. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద భారీగా వస్తోంది. లక్షా 3వేల క్కూసెక్కుల ప్రవాహం ఎగువ నుంచి శ్రీశైలం డ్యాంకి వస్తోంది. శ్రీశైలం నుంచి దిగువకు 39వేల క్కూసెక్కుల నీటిని వదులుతున్నారు. దాంతో నాగార్జున సాగర్‌కు 38వేల క్కూసెక్కుల ప్రవాహం వస్తోంది.

ప్రస్తుతం శ్రీశైలంలో 71.44 టీఎంసీల నీరు ఉంది. నాగార్జున సాగర్‌లో నీటి నిల్వ 173 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర ప్రాజెక్టులోకి 24వేల క్కూసెక్కుల ప్రవాహం వస్తోంది. రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో చిన్నచిన్న ప్రాజెక్టులు, చెరువులు నిండుతున్నాయి. తుంగభద్రకు వరద వస్తుండడంతో సుంకేశుల, అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లు నిండాయి.

అనంతపురం జిల్లాలో వర్షాలకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి 4.5 టీఎంసీల నీరు వచ్చి చేరింది. ఉభయగోదావరి జిల్లాల్లోనూ పలు ప్రాజెక్టులకు భారీగా నీరు చేరింది. కర్నూలు నగరం వద్ద హంద్రీ నదికి వరద పోటెత్తింది.

First Published:  22 July 2020 3:41 AM IST
Next Story