నిమ్మగడ్డ నియామకం ఇప్పట్లో లేనట్టే...
తనను తిరిగి ఈసీగా నియమించేలా చూడాలంటూ ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన వినతిపై గవర్నర్ కార్యాలయం స్పందించింది. నిమ్మగడ్డకు గవర్నర్ కార్యదర్శి రిప్లై ఇచ్చారు. ”మీ వినతిపత్రాన్ని గవర్నర్ పరిశీలించారు. హైకోర్టు తీర్పు ఆధారంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచన చేశారు”అంటూ గవర్నర్ కార్యదర్శి … నిమ్మగడ్డకు నోట్ పంపారు. ఈ నోట్ బయటకు రాగానే నిమ్మగడ్డను తిరిగి ఈసీగా నియమించాలంటూ గవర్నర్ ఆదేశించారంటూ టీడీపీ చానళ్లు ప్రచారం చేశాయి. కానీ గవర్నర్ ఎక్కడా […]
తనను తిరిగి ఈసీగా నియమించేలా చూడాలంటూ ఇటీవల నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇచ్చిన వినతిపై గవర్నర్ కార్యాలయం స్పందించింది. నిమ్మగడ్డకు గవర్నర్ కార్యదర్శి రిప్లై ఇచ్చారు. ”మీ వినతిపత్రాన్ని గవర్నర్ పరిశీలించారు. హైకోర్టు తీర్పు ఆధారంగా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వానికి సూచన చేశారు”అంటూ గవర్నర్ కార్యదర్శి … నిమ్మగడ్డకు నోట్ పంపారు.
ఈ నోట్ బయటకు రాగానే నిమ్మగడ్డను తిరిగి ఈసీగా నియమించాలంటూ గవర్నర్ ఆదేశించారంటూ టీడీపీ చానళ్లు ప్రచారం చేశాయి. కానీ గవర్నర్ ఎక్కడా నేరుగా నిమ్మగడ్డను ఈసీగా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేదు. హైకోర్టు తీర్పు ఆధారంగా తగు చర్యలు తీసుకోండి అని మాత్రమే సూచించారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏం చేస్తుందన్న దానికి చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తమకు గవర్నర్ మీద గౌరవం ఉందని చెప్పారు. హైకోర్టు తీర్పును కూడా తాము తప్పుపట్టడం లేదన్నారు. కాకపోతే హైకోర్టు తీర్పులో రాజ్యాంగపరమైన సమస్యలు ఉన్నందున సుప్రీంకోర్టును ప్రభుత్వం ఆశ్రయించిందని చెప్పారు. కాబట్టి సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు ఎదురుచూస్తామని చెప్పారు.
కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని గవర్నర్‌కు వివరిస్తామని చెప్పారు. శ్రీకాంత్ రెడ్డి చెప్పిన దానిబట్టి చూస్తే తక్షణం నిమ్మగడ్డను తిరిగి ఈసీగా నియమించే అవకాశాలు కనిపించడం లేదు. సుప్రీం కోర్టు తీర్పు వచ్చే వరకు నిమ్మగడ్డ వ్యవహారంపై స్పష్టత వచ్చే అవకాశం లేదు.