దర్శనాలు ఆపబోం " టీటీడీ చైర్మన్
తిరుమలలో భక్తుల దర్శనాలను కొనసాగిస్తామని చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పరిస్థితిపై ప్రతిరోజూ సమీక్షిస్తూనే ఉన్నామన్నారు. జూన్ 8 నుంచి కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ దర్శనాలు కల్పిస్తున్నామన్నారు. ఇదే పద్దతిని కొనసాగించాలనుకుంటున్నామన్నారు. తిరుపతిలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఉందని… కొందరు అర్చకులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. అర్చకులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. తిరుపతిలో బుకింగ్‌ను నిలిపివేశామన్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న వారు నేరుగా తిరుమలకు వస్తారన్నారు. నిన్న ఆరువేల మంది మాత్రమే దర్శనం […]
తిరుమలలో భక్తుల దర్శనాలను కొనసాగిస్తామని చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. పరిస్థితిపై ప్రతిరోజూ సమీక్షిస్తూనే ఉన్నామన్నారు. జూన్ 8 నుంచి కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ దర్శనాలు కల్పిస్తున్నామన్నారు. ఇదే పద్దతిని కొనసాగించాలనుకుంటున్నామన్నారు.
తిరుపతిలో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఉందని… కొందరు అర్చకులకు కూడా కరోనా పాజిటివ్ వచ్చిందన్నారు. అర్చకులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు.
తిరుపతిలో బుకింగ్‌ను నిలిపివేశామన్నారు. ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకున్న వారు నేరుగా తిరుమలకు వస్తారన్నారు. నిన్న ఆరువేల మంది మాత్రమే దర్శనం చేసుకున్నారని చెప్పారు. మాస్కులు ధరించే వారిని మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తుమన్నారు.
జబులు, జ్వరం ఉన్న వారిని అలిపిరి వద్దే ఆపేస్తున్నామన్నారు. భక్తుల ద్వారా తిరుమలలో కరోనా వ్యాప్తి చెందడం లేదన్నారు. 65 ఏళ్లు పైబడిన వారిని, చిన్న పిల్లలను దర్శనాలకు తీసుకురావొద్దని చెప్పామన్నారు. రోజూ శానిటైజ్ చేస్తున్నామన్నారు వైవీ సుబ్బారెడ్డి.