Telugu Global
National

బెడిసికొడుతున్న టీడీపీ ప్లాన్స్‌ !

2019లో అధికారం పోయింది. అప్పటి నుంచి టీడీపీ నేతలు అధికార పార్టీ వైసీపీని ఇబ్బందిపెట్టడానికి ప్లాన్ లు అమలు చేస్తూనే ఉన్నారు. కానీ వర్క్‌ అవుట్‌ కావడం లేదు. తాజాగా మరో ఎస్సీ నేత సూసైడ్ అటెంప్ట్‌ ప్లాప్‌ ప్లాన్‌ లిస్ట్‌లో చేరింది. వైసీపీ పెద్దలు తనని మోసం చేశారంటూ ఏపీ మాలమహానాడు అధ్యక్షుడు రాలు జోని కుమారి విషం తాగారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఆమెకు ఎవరు అన్యాయం చేశారో… పదవులు […]

బెడిసికొడుతున్న టీడీపీ ప్లాన్స్‌ !
X

2019లో అధికారం పోయింది. అప్పటి నుంచి టీడీపీ నేతలు అధికార పార్టీ వైసీపీని ఇబ్బందిపెట్టడానికి ప్లాన్ లు అమలు చేస్తూనే ఉన్నారు. కానీ వర్క్‌ అవుట్‌ కావడం లేదు. తాజాగా మరో ఎస్సీ నేత సూసైడ్ అటెంప్ట్‌ ప్లాప్‌ ప్లాన్‌ లిస్ట్‌లో చేరింది.

వైసీపీ పెద్దలు తనని మోసం చేశారంటూ ఏపీ మాలమహానాడు అధ్యక్షుడు రాలు జోని కుమారి విషం తాగారు. విజయవాడలోని ప్రెస్‌క్లబ్‌లో ఈ ఘటన జరిగింది. అయితే ఆమెకు ఎవరు అన్యాయం చేశారో… పదవులు ఇస్తామని ఎవరు ఆశపెట్టారో ఆమె చెప్పలేదు. జులై 6న విజయసాయిరెడ్డిని కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించానని మాత్రమే చెప్పారు.

ఈ ఘటన తర్వాత ఆమె గురించి సోషల్‌మీడియాలో విపరీత ప్రచారం జరిగింది. ఎన్నికల ముందు ఆమె టీడీపీ నేతలు దేవినేని ఉమా, నందిగామ మాజీ ఎమ్మెల్యే సౌమ్యతో ఉన్న ఫొటోలను నెటిజన్లు పోస్టు చేశారు. టీడీపీలో ఉన్న ఆమెకు వైసీపీలో ఎలా అన్యాయం జరిగిందంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

ఇంతకుముందు కూడా ఇలాంటి ఎపిసోడ్లు మనం చూశాం. విశాఖలో డాక్టర్‌ సుధాకర్‌, చిత్తూరులో అనితారాణి. ఇద్దరూ డాక్టర్లే. ఒకే సామాజికవర్గం. వైజాగ్‌ ఎపిసోడ్‌లో ట్విస్ట్‌లు ముగిసిన వెంటనే… అదే తరహాలో అనితారాణి వ్యవహారం తెరపైకి వచ్చింది. నారా లోకేష్‌ ఆమె వీడియోను ట్వీట్‌ చేశారు.

ఇప్పుడు విజయవాడలో ఈ సూసైడ్‌ డ్రామా కూడా ఆ కోవలోకే వస్తుందని వైసీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ వరుస ఎపిసోడ్‌లను పరిశీలిస్తే టీడీపీ నేతలు కావాలనే స్కెచ్‌లు గీస్తున్నారని అర్ధమవుతోంది.

టీడీపీ మొదటి నుంచి బీసీ ఓటుబ్యాంక్‌పై ఆధారపడి అధికారంలోకి వస్తోంది. మొన్నటి ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంక్‌ దూరం జరిగింది. దీంతో తిరిగి ఆ ఓటుబ్యాంక్ వచ్చే సూచనలు కనిపించడంలేదు. దీంతో వైసీపీకి పునాదిగా ఉన్న ఎస్సీ ఓటుబ్యాంక్ ను‌ దూరం చేయాలని టీడీపీ పెద్దలు ప్లాన్‌ వేశారు. అందులో భాగంగా ఈ మూడు ఎపిసోడ్‌లు నడిచాయని వైసీపీ నేతల్లో అనుమానం ఉంది.

దళితుల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా ? దళితులు సరైన దుస్తులు ధరించరు…. అంటూ ఐదేళ్లలో టీడీపీ అధినేత నుంచి పార్టీ నేతల వరకు ఇలాంటి డైలాగులు వదిలారు. దీంతో ఆ సామాజికవర్గం పూర్తిగా టీడీపీకి దూరమైంది. ఇప్పుడు అక్కడ పట్టుకోసం ఇలాంటి ఎత్తుగడలు వేస్తున్నారు.

అయితే ఈ ఎపిసోడ్‌లు నాలుగు రోజులు మీడియాలో నానుతాయి. ఆతర్వాత జనం మర్చిపోతారు. వర్ల రామయ్య లాంటి నేతలనే కరివేపాకులా వాడుకుంటున్నారు. ఇక ఆ పార్టీలో దళితులకు పెద్దపీట వేస్తారని జనం ఎలా నమ్ముతారు అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మొత్తానికి మొన్నటి ఎన్నికల్లో పోయిన ఓటు బ్యాంక్‌ కోసం టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. అయితే వివాదాలతో జనం ఓట్లేయరని… వివిధ కార్యక్రమాల ద్వారా వారి దగ్గరకు వెళితేనే జనం నమ్ముతారనే విషయం గుర్తుంచుకోవాలనేది కొందరి టీడీపీ నేతల వాదన.

First Published:  21 July 2020 2:45 AM IST
Next Story