Telugu Global
International

ట్రంప్‌ ఈసారి గెలుస్తాడా? అమెరికా అధ్యక్ష రేసులో గట్టి పోటీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు మొదలైంది. రిపబ్లికన్‌ పార్టీ తరపున డోనాల్డ్‌ ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ కావాలని కలలు కంటున్నారు. డెమోక్రాటిక్‌ పార్టీ తరపున జో బిడెన్‌ గట్టి పోటీ ఇస్తున్నారు. 2020 నవంబర్‌ 3న ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రస్తుతానికి వెలువడుతున్న ప్రాథమిక అంచనాల ప్రకారం ట్రంప్‌, బిడెన్‌ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. సర్వేల ప్రకారం ఇద్దరి మధ్య పెద్ద తేడా లేదు. ఒకటి నుంచి ఐదు శాతం లోపు మాత్రమే ఓట్ల తేడా ఉంది. […]

ట్రంప్‌ ఈసారి గెలుస్తాడా? అమెరికా అధ్యక్ష రేసులో గట్టి పోటీ
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసు మొదలైంది. రిపబ్లికన్‌ పార్టీ తరపున డోనాల్డ్‌ ట్రంప్ మరోసారి ప్రెసిడెంట్ కావాలని కలలు కంటున్నారు. డెమోక్రాటిక్‌ పార్టీ తరపున జో బిడెన్‌ గట్టి పోటీ ఇస్తున్నారు. 2020 నవంబర్‌ 3న ఎన్నికలు జరగబోతున్నాయి.

ప్రస్తుతానికి వెలువడుతున్న ప్రాథమిక అంచనాల ప్రకారం ట్రంప్‌, బిడెన్‌ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. సర్వేల ప్రకారం ఇద్దరి మధ్య పెద్ద తేడా లేదు. ఒకటి నుంచి ఐదు శాతం లోపు మాత్రమే ఓట్ల తేడా ఉంది.

ఇంకో 100 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటినుంచే అసలు ఫైట్‌ మొదలైంది. సెప్టెంబర్ 29, అక్టోబర్ 7, అక్టోబర్ 15న అభ్యర్థుల మధ్య నిర్వహించే ఓపెన్‌ డిబేట్‌ గెలుపోటములను నిర్ణయిస్తుంది. ఈ డిబేట్‌ను బట్టి ఎవరికి ఓటు వేయాలనే విషయంపై జనాలు నిర్ణయం తీసుకుంటారు.

అమెరికా లోని 50 రాష్ట్రాల్లో మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్స్ ఉన్నాయి. గెలవాలంటే 270 రావాలి. ప్రతి రాష్ట్రానికి కొన్ని ఎలక్టోరల్ ఓట్స్ ఉంటాయి. గత ఎన్నికల్లో అమెరికా వ్యాప్తంగా డోనాల్డ్ ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ కే ఎక్కువ ఓట్స్ వచ్చాయి. కానీ ఏ రాష్ట్రం లో ఎవరు గెలిచారు అక్కడ ఉన్న ఎలక్టోరల్ ఓట్స్ ఎన్ని అనే దానిపై అమెరికా అధ్యక్ష ఎంపిక ఉంటుంది. అందుకే గతం లో డోనాల్డ్ ట్రంప్ గెలిచాడు.

ఒహాయో, నార్త్ కరోలినా, ఫ్లోరిడా, మిచిగన్, పెన్సిల్ వేనియా, విస్కాన్సన్ రాష్ట్రాల అభ్యర్థుల గెలుపోటములే… ఫలితాలపై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. డోనాల్డ్ ట్రంప్ వయస్సు 74, జో బిడెన్ వయస్సు 77. ట్రంప్ వైపు వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధి ఇండియానా రాష్ట్రానికి చెందిన మైక్ పెన్స్ పేరును ఖరారు చేశారు. కానీ డెమోక్రాటిక్ పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ది పేరు ఇంకా ఖరారు చేయలేదు.

నల్ల జాతీయులు నిరసనలు తెలుపుతున్న సందర్భం లో వైస్ ప్రెసిడెంట్ ని నల్ల జాతీయుల నుంచి అదీ ఒక మహిళని తీసుకోవాలనేది డెమోక్రాటిక్ పార్టీ ఆలోచన గా అనిపిస్తుంది. ఇంకా జో బిడెన్ వయస్సు 77, ఇప్పుడు గెలిచినా ఇంకో టర్మ్ నిలబడలేకపోవచ్చు. వైస్ ప్రెసిడెంట్ అభ్యర్ధి ఎన్నిక అమెరికా చరిత్ర లో మొదటి సారి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

ఎన్నికలకి ఇంకా 100 రోజుల టైమ్ ఉంది. ఏమైనా జరగవచ్చు. వ్యాక్సిన్ వచ్చి ట్రంప్ ఇమేజ్ పెరగవచ్చు. ఆర్ధిక మాంధ్యం వలన ట్రంప్ ఇమేజ్ తగ్గొచ్చు. ఈ చివరి 100 రోజులు అత్యంత ముఖ్యం. ఈ చివరి 100 రోజులని చూసే, డిబెట్స్ ని బట్టి న్యూట్రల్ గా ఉన్నవారు డిసైడ్ అవుతారు.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం ట్రంప్‌, బిడెన్‌ మధ్య టైట్‌ ఫైట్‌ నడుస్తోంది. నాలుగు శాతం ఓట్లతో బిడెన్‌ బయటపడొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు. మరికొందరు మాత్రం చివరల్లో ట్రంప్‌ పుంజుకొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

First Published:  21 July 2020 2:42 AM IST
Next Story