Telugu Global
National

కరోనాభరణం... బంగారు మాస్కు!

కరోనాని అడ్డుకునేందుకు మాస్క్ ని  వాడటం తప్పనిసరి… అనే విషయాన్ని తనదైన శైలిలో చెప్పాడు రాధా కృష్ణన్ సుందరం ఆచార్య. కొయంబత్తూర్ కి చెందిన ఆచార్య… నగల తయారీ నిపుణుడు. తన నైపుణ్యంతో బంగారు, వెండి తీగలను వాడి మాస్క్ ని రూపొందించాడు. 0.06 మిల్లీమీటర్ల  అతి సన్నని బంగారు వెండి తీగలను ఇందుకోసం వినియోగించాడు. 2.75 లక్షల రూపాయల విలువ చేసే 18 కేరట్ల బంగారాన్ని, 15 వేల రూపాయల విలువ చేసే వెండిని మాస్క్ […]

కరోనాభరణం... బంగారు మాస్కు!
X

కరోనాని అడ్డుకునేందుకు మాస్క్ ని వాడటం తప్పనిసరి… అనే విషయాన్ని తనదైన శైలిలో చెప్పాడు రాధా కృష్ణన్ సుందరం ఆచార్య. కొయంబత్తూర్ కి చెందిన ఆచార్య… నగల తయారీ నిపుణుడు. తన నైపుణ్యంతో బంగారు, వెండి తీగలను వాడి మాస్క్ ని రూపొందించాడు. 0.06 మిల్లీమీటర్ల అతి సన్నని బంగారు వెండి తీగలను ఇందుకోసం వినియోగించాడు.

2.75 లక్షల రూపాయల విలువ చేసే 18 కేరట్ల బంగారాన్ని, 15 వేల రూపాయల విలువ చేసే వెండిని మాస్క్ తయారీకి వాడాడు. దాంతో ధగధగ మెరిసిపోతున్న అందమైన మాస్క్ చూపరులను ఆకట్టుకునేలా తయారైంది. కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు మాస్క్ తప్పనిసరి అనే అవగాహన కల్పించేందుకే దీనిని రూపొందించినట్టుగా ఆచార్య తెలిపాడు.

బంగారు మాస్క్ లను ధనవంతులు మాత్రమే వాడగలరని, పెళ్లిళ్లు ఇతర శుభ కార్యాలకు వీటిని ధరించవచ్చని, ఇప్పటివరకు తనకు తొమ్మిది బంగారు మాస్క్ లకు ఆర్డర్లు వచ్చాయని అతను వెల్లడించాడు. ఒక్కోమాస్క్ తయారీకి ఏడు రోజులు పడుతోంది.

ఆచార్యకు మొదటి నుండీ భిన్నమైన బంగారు వస్తువులను తయారుచేయడమంటే చాలా ఇష్టం. అందుకే నగల తయారీ కంపెనీలో చేస్తున్న ఉద్యోగం వదిలేసి సొంతంగా తనదైన శైలిలో విభిన్న రూపకల్పనలు చేస్తున్నాడు. బంగారంతో దుస్తులు, హ్యాండ్ బ్యాగులు, గొడుగులు లాంటివి తయారుచేస్తున్నాడు. ధరించినవారి అందాన్ని పెంచేలాగే ఉన్న తన తాజా సృజన బంగారు మాస్కుని కరోనాభరణమనాలేమో….కంఠాభరణంలాగా.

First Published:  20 July 2020 6:25 AM GMT
Next Story