22న ఏపీ మంత్రివర్గ విస్తరణ... ఆఇద్దరికే చాన్స్ !
ఏపీ మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది. ఈనెల 22న మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆరోజు ఇద్దరు కొత్తమంత్రులు ప్రమాణం చేయనున్నారు. రాజీనామా చేసిన ఇద్దరు మంత్రుల సామాజికవర్గానికే తిరిగి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో మంత్రివర్గంలో చాన్స్‌పై ఆశలు పెట్టుకున్నవారికి చెక్ పడింది. తూర్పుగోదావరి జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంతకుముందు మంత్రిగా ఉండేవారు. ఈయన శెట్టిబలిజ. ఇప్పుడు ఇదే సామాజికవర్గానికి చెందిన రామచంద్రాపురం […]
ఏపీ మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది. ఈనెల 22న మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఆరోజు ఇద్దరు కొత్తమంత్రులు ప్రమాణం చేయనున్నారు.
రాజీనామా చేసిన ఇద్దరు మంత్రుల సామాజికవర్గానికే తిరిగి మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించారు. దీంతో మంత్రివర్గంలో చాన్స్‌పై ఆశలు పెట్టుకున్నవారికి చెక్ పడింది.
తూర్పుగోదావరి జిల్లాలో పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇంతకుముందు మంత్రిగా ఉండేవారు. ఈయన శెట్టిబలిజ. ఇప్పుడు ఇదే సామాజికవర్గానికి చెందిన రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణకు మంత్రి పదవి దక్కే అవకాశం కన్పిస్తోంది.
ఇక మోపిదేవి వెంకటరమణది మత్స్యకార సామాజికవర్గం. ఇప్పుడు ఇదే సామాజికవర్గానికి చెందిన పలాస ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజుకు మంత్రి అయ్యే చాన్స్ ఉంది.
మంత్రులు మోపిదేవి, పిల్లి సుభాష్ చంద్రబోస్ ఇటీవలే రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు. ఈనెల 22 తర్వాత ఎంపీలుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. వీరి స్థానంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలను మంత్రులుగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా పశ్చిమగోదావరి జిల్లా ఎస్సీ వర్గానికి చెందిన మోషిన్ రాజు, కడప జిల్లా రాయచోటికి చెందిన అఫ్జల్‌ఖాన్ సతీమని జకియా సుల్తానా పేర్లను ఖరారు చేశారు.