31వేల టెస్టులు... 5 వేల కేసులు " ఏపీలో కరోనా పంజా
ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. శనివారం ఉదయం తొమ్మిది గంటలనుంచి ఆదివారం తొమ్మిది గంటల వరకు 24 గంటల్లో నిర్వహించిన పరీక్షల్లో 5041 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. 31 వేల 148 మందికి టెస్ట్‌లు నిర్వహిస్తే ఐదు వేలకు పైగా పాజిటివ్ కేసులు రావడంతో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకూ ఏపీలో 13 లక్షల 15 వేలకు పైగా పరీక్షలు నిర్వహించడం ఓ రికార్డుగా నమోదైంది. 31 వేలకు పైగా పరీక్షలు ఒక్క రోజులో చేయడం […]
ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగాయి. శనివారం ఉదయం తొమ్మిది గంటలనుంచి ఆదివారం తొమ్మిది గంటల వరకు 24 గంటల్లో నిర్వహించిన పరీక్షల్లో 5041 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది. 31 వేల 148 మందికి టెస్ట్‌లు నిర్వహిస్తే ఐదు వేలకు పైగా పాజిటివ్ కేసులు రావడంతో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకూ ఏపీలో 13 లక్షల 15 వేలకు పైగా పరీక్షలు నిర్వహించడం ఓ రికార్డుగా నమోదైంది.
31 వేలకు పైగా పరీక్షలు ఒక్క రోజులో చేయడం వల్లే ఈ స్థాయిలో కేసులు బయటపడ్డాయని అధికారులు అంటున్నారు. మరోవైపు హైదరాబాద్, బెంగళూరులో లాక్‌డౌన్ భయంతో అక్కడ స్థిరపడ్డ ఏపీవారు రాష్ట్రానికి తిరిగివచ్చారు. ఇక్కడి నుంచే కాదు… ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఏపీకి వచ్చారు. దాదాపు 20లక్షల మందికి పైగా ఈ నెల రోజుల్లో ఏపీకి వచ్చారని తెలుస్తోంది.
ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు అన్‌లాక్ తర్వాత వైరస్ వ్యాప్తి జరగడంతో కేసులు పెరిగాయని అధికారులు వివరిస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో శ్రీకాకుళం జిల్లాలో ఒక్క కేసు లేదు. కానీ ఇప్పుడు అక్కడ 24 గంటల్లో 535 కేసులు బయటపడ్డాయి. ఇక విజయనగరంలో 241, పశ్చిమగోదావరిలో 393, చిత్తూరు 440, అనంతపురం 637, తూర్పుగోదావరి 647 మందికి పాజిటివ్ రిపోర్టు వచ్చింది.