Telugu Global
National

చదివింది పదే... కానీ ఆసుపత్రి పెట్టారు

ఇటీవలే కొందరు నకిలీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకును స్థాపించిన విషయం తెలిసిందే. బ్యాంకు పెట్టిన మూడు రోజులకే విషయం తెలిసిపోయింది. కానీ ఇక్కడ పదో తరగతే చదివిన ఇద్దరు ప్రబుద్దులు మాత్రం నకిలీ ఆసుపత్రి పెట్టి రెండున్నర ఏళ్లుగా రోగుల నుంచి రూ. లక్షల్లో దండుకున్నారు. ఫార్మసీలో జరిగిన చిన్న వ్యవహారంతో విషయం మొత్తం బయటకు వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో చోటు చేసుకుంది. నగరానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ముజీబ్, మహ్మద్ […]

చదివింది పదే... కానీ ఆసుపత్రి పెట్టారు
X

ఇటీవలే కొందరు నకిలీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకును స్థాపించిన విషయం తెలిసిందే. బ్యాంకు పెట్టిన మూడు రోజులకే విషయం తెలిసిపోయింది. కానీ ఇక్కడ పదో తరగతే చదివిన ఇద్దరు ప్రబుద్దులు మాత్రం నకిలీ ఆసుపత్రి పెట్టి రెండున్నర ఏళ్లుగా రోగుల నుంచి రూ. లక్షల్లో దండుకున్నారు. ఫార్మసీలో జరిగిన చిన్న వ్యవహారంతో విషయం మొత్తం బయటకు వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో చోటు చేసుకుంది.

నగరానికి చెందిన మహ్మద్ అబ్దుల్ ముజీబ్, మహ్మద్ సోహెబ్ సుభానీలు 10వ తరగతి వరకు చదివారు. వైద్య విద్యను అభ్యసించామంటూ నకిలీ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి ఆసుపత్రి పెట్టడానికి అనుమతి పొందారు. సుభానీ చైర్మన్‌గా, ముజీబ్ ఎండీగా మారి ఆసిఫ్‌నగర్-మెహదీపట్నం రహదారిపై ప్రైవేటు ఆసుపత్రిని తెరిచారు. వాళ్ల ఆసుపత్రిలో స్పెషలిస్టు వైద్యులను నియమించుకున్నారు. గత రెండున్నర ఏళ్లుగా ఈ ఆసుపత్రిని ఎవరికీ అనుమానం రాకుండా నడిపిస్తున్నారు.

లాక్‌డౌన్ సమయంలో కూడా ఆసుపత్రిలో రోగులకు వైద్యం చేసి రూ. లక్షల్లో దండుకున్నారు. కాగా, ఇటీవల కరోనా వ్యాధికి కూడా చికిత్స చేయడం మొదలు పెట్టారు. ఆ సమయంలో కరోనాకు చెందిన ఇంజెక్షన్లను వాళ్ల ఫార్మసీలో అధిక ధరలకు విక్రయించడం మొదలు పెట్టారు. దీంతో ఒక బాధితుడు పోలీసులకు పిర్యాదు చేశాడు.

ఆసుపత్రిలో పోలీసులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. కరోనాకు సంబంధించి 10 ఇంజెక్షన్లను స్వాధీనం చేసుకొని ఏడుగురిని అరెస్టు చేశారు. కాగా పోలీసు విచారణలో సుభానీ, ముజీబ్ నకిలీ డాక్టర్లని తేలింది. దీంతో వారిని ఆదివారం అరెస్టు చేశారు. ఆసుపత్రికి చెందిన అన్ని రిజిస్ట్రేషన్ పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారికి అనుమతులు ఇవ్వడానికి సహాయం చేసిన వాళ్లను కూడా గాలిస్తున్నారు.

First Published:  20 July 2020 2:00 AM IST
Next Story