నాడు- నేడుతో మారుతున్న ఏపీ ప్రభుత్వ స్కూళ్ల రూపు రేఖలు !
ప్రభుత్వ స్కూళ్లు దండగ ఒకప్పటి మాట. గవర్నమెంట్ స్కూళ్లే బెటర్ ఇప్పటి మాట. ఏపీలో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత సర్కారీ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు కంకణం కట్టుకుంది. ఏడాదిలో మార్పు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేయడమే కాదు…. అన్నట్లుగానే స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నారు. ఇప్పటికే విద్యార్థుల సంఖ్యను బట్టి మండలాల్లో స్కూళ్లను ఎంపిక చేశారు. కరోనాతో విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో స్కూళ్లలో మరమ్మత్తులు చేపట్టారు, పాత స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నారు. ప్రతి స్కూల్ […]
ప్రభుత్వ స్కూళ్లు దండగ ఒకప్పటి మాట. గవర్నమెంట్ స్కూళ్లే బెటర్ ఇప్పటి మాట. ఏపీలో జగన్ సర్కార్ వచ్చిన తర్వాత సర్కారీ స్కూళ్ల రూపురేఖలు మార్చేందుకు కంకణం కట్టుకుంది. ఏడాదిలో మార్పు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేయడమే కాదు…. అన్నట్లుగానే స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నారు.
ఇప్పటికే విద్యార్థుల సంఖ్యను బట్టి మండలాల్లో స్కూళ్లను ఎంపిక చేశారు. కరోనాతో విద్యాసంవత్సరం ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో స్కూళ్లలో మరమ్మత్తులు చేపట్టారు, పాత స్కూళ్ల రూపురేఖలు పూర్తిగా మారుస్తున్నారు.
ప్రతి స్కూల్ కు పెయింటింగ్‌లు వేస్తున్నారు. మరుగుదొడ్లు నిర్మిస్తున్నారు. టేబుళ్ల నుంచి అన్ని కొత్త సదుపాయాలు కల్పిస్తున్నారు. బ్రాండెడ్ లేబుళ్లతో స్కూళ్లను కార్పొరేట్ సూళ్ళకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు.
వచ్చే మూడేళ్లలో ఏపీలో ప్రభుత్వ పాఠశాలలపై ఉన్న అభిప్రాయాన్ని మార్చాలని జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుంది. ఇప్పటికే ఈ ఏడాది అందులో సక్సెస్ అయింది. జగనన్న దీవెన, అమ్మ ఒడి కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు పుస్తకాలు, ఆర్ధిక సాయం ఇస్తున్నారు.
మరోవైపు ప్రభుత్వ స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు స్కూల్ డ్రెస్, షూస్ కొలతలు తీసుకున్నారు. వారు స్కూలుకు రాగానే డ్రెస్ అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తే ప్రభుత్వ స్కూళ్లలో ఒక్కసారిగా విద్యార్థుల సంఖ్య పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. దీంతో రాబోయే రోజుల్లో ఏపీలో ప్రభుత్వ స్కూళ్లపై ఉండే అభిప్రాయం పూర్తిగా మారిపోతుంది.