తిరుమలలో దర్శనాల రద్దు యోచన
తిరుమలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భక్తుల దర్శనాలపై టీటీడీ పునరాలోచన చేస్తోంది. ఇప్పటి వరకు తిరుమలలో 170 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 18 మంది అర్చకులు, 100 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. 20 మంది పోటు సిబ్బందికి వైరస్ సోకింది. శ్రీవారి ఆలయ పెద్ద జీయర్‌కు కూడా కరోనా బారిన పడ్డారు. ఇలా కరోనా కేసులు పెరుగుతుండడంతో టీడీపీ అప్రమత్తమైంది. దర్శనాల రద్దు యోచనలో టీటీడీ ఉంది. ఆలయ ఆగమ సలహా మండలి […]
తిరుమలలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భక్తుల దర్శనాలపై టీటీడీ పునరాలోచన చేస్తోంది. ఇప్పటి వరకు తిరుమలలో 170 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 18 మంది అర్చకులు, 100 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు. 20 మంది పోటు సిబ్బందికి వైరస్ సోకింది.
శ్రీవారి ఆలయ పెద్ద జీయర్‌కు కూడా కరోనా బారిన పడ్డారు. ఇలా కరోనా కేసులు పెరుగుతుండడంతో టీడీపీ అప్రమత్తమైంది. దర్శనాల రద్దు యోచనలో టీటీడీ ఉంది.
ఆలయ ఆగమ సలహా మండలి గౌరవాధ్యక్షుడు రమణదీక్షితులు కూడా తక్షణం తిరుమలలో భక్తుల దర్శనాలు ఆపివేయాలని టీటీడీ చైర్మన్‌ను కోరారు. ఆలయ అర్చకుల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని… వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దర్శనాలు రద్దు చేయాలని కోరారు. కొన్ని వారాల పాటు దర్శనాలు నిలిపివేసి శ్రీవారికి ఏకాంతంగా కైంకర్యాలను నిర్వహించాలని సూచించారు.