రఘురామకృష్ణంరాజు సీటు మార్చిన స్పీకర్
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు స్పీకర్ షాక్ ఇచ్చారు. లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు స్థానాన్ని స్పీకర్ మార్చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ముందు సీటు నుంచి వెనుకకు రఘురామకృష్ణంరాజు స్థానం వెళ్లిపోయింది. ఇప్పటి వరకు రఘురామకృష్ణంరాజు సీటు నెంబర్ 379లో కూర్చునే వారు. ఇకపై ఆయన సీటు నెంబర్ 445లో కూర్చుంటారు. రఘురామకృష్ణంరాజు సీటును వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్‌కు కేటాయించారు స్పీకర్. మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, బెల్లన చంద్రశేఖర్ సీట్లు ముందుకెళ్లగా… రఘురామకృష్ణంరాజు […]
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకు స్పీకర్ షాక్ ఇచ్చారు. లోక్‌సభలో రఘురామకృష్ణంరాజు స్థానాన్ని స్పీకర్ మార్చేశారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ముందు సీటు నుంచి వెనుకకు రఘురామకృష్ణంరాజు స్థానం వెళ్లిపోయింది.
ఇప్పటి వరకు రఘురామకృష్ణంరాజు సీటు నెంబర్ 379లో కూర్చునే వారు. ఇకపై ఆయన సీటు నెంబర్ 445లో కూర్చుంటారు. రఘురామకృష్ణంరాజు సీటును వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్‌కు కేటాయించారు స్పీకర్.
మార్గాని భరత్, కోటగిరి శ్రీధర్, బెల్లన చంద్రశేఖర్ సీట్లు ముందుకెళ్లగా… రఘురామకృష్ణంరాజు సీటు మాత్రం సీటు నెంబర్ 379 నుంచి సీటు నెంబర్ 445కు వెళ్లిపోయింది. అనర్హత పిటిషన్ సమర్పించే సమయంలోనే రఘురామకృష్ణంరాజు సీటు మార్చాల్సిందిగా స్పీకర్‌ను వైసీపీ కోరింది. పార్టీ ఫిర్యాదు మేరకే రఘురామకృష్ణంరాజు సీటును స్పీకర్ మార్చినట్టు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి.