Telugu Global
NEWS

గవర్నర్‌ వద్దకు చేరిన మూడు రాజధానుల బిల్లు

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ బిల్లులు గవర్నర్‌ వద్దకు చేరాయి. ఈ రెండు బిల్లులు రెండో సారి శానసమండలిలో ప్రవేశపెట్టి నెల దాటిపోవడంతో నిబంధనల ప్రకారం వాటిని అసెంబ్లీ అధికారులు గవర్నర్ వద్దకు పంపారు. గవర్నర్‌ బిల్లులను ఆమోదిస్తే సీఆర్‌ఏడీ రద్దు అయిపోయినట్టే. మూడు రాజధానుల ఏర్పాటుకు లైన్‌ క్లియర్ అయినట్టే. తొలిసారి అసెంబ్లీ ఆమోదించి ఈ బిల్లులను మండలికి పంపగా అక్కడ తనకున్న బలంతో టీడీపీ అడ్డుకుంది. మండలి చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు చెప్పారు. […]

గవర్నర్‌ వద్దకు చేరిన మూడు రాజధానుల బిల్లు
X

మూడు రాజధానులు, సీఆర్‌డీఏ బిల్లులు గవర్నర్‌ వద్దకు చేరాయి. ఈ రెండు బిల్లులు రెండో సారి శానసమండలిలో ప్రవేశపెట్టి నెల దాటిపోవడంతో నిబంధనల ప్రకారం వాటిని అసెంబ్లీ అధికారులు గవర్నర్ వద్దకు పంపారు. గవర్నర్‌ బిల్లులను ఆమోదిస్తే సీఆర్‌ఏడీ రద్దు అయిపోయినట్టే. మూడు రాజధానుల ఏర్పాటుకు లైన్‌ క్లియర్ అయినట్టే.

తొలిసారి అసెంబ్లీ ఆమోదించి ఈ బిల్లులను మండలికి పంపగా అక్కడ తనకున్న బలంతో టీడీపీ అడ్డుకుంది. మండలి చైర్మన్ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతున్నట్టు చెప్పారు.

కానీ చైర్మన్ నిబంధనలు పాటించలేదని.. కాబట్టి బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపడం కుదరదని అధికారులు తేల్చిచెప్పారు. అలా తొలిసారి బిల్లులు మండలికి చేరి మూడు నెలలు దాటినా స్పందన రాలేదు. దాంతో మరోసారి ఇటీవల అసెంబ్లీ ఈ రెండు బిల్లులను ఆమోదించి శాసనమండలికి పంపింది.

రెండోసారి కూడా ఈ బిల్లు ఆమోదం పొందకుండా టీడీపీ అడ్డుకుంది. అయితే రూల్స్ ప్రకారం శానసమండలి రెండోసారి పంపిన బిల్లును నెల రోజులు మాత్రమే ఆపగలదు. ఆ గడువు ముగిసిపోయింది. దాంతో బిల్లులను గవర్నర్‌కు అసెంబ్లీ అధికారులు పంపించారు.

First Published:  18 July 2020 11:30 AM IST
Next Story