మరోసారి తెరపైకి రజనీ రాజకీయాలు
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం అనేది పెద్ద జోక్‌గా మారిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రజనీ రాజకీయ అరంగేట్రం గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అభిమానులు ఎప్పటికప్పుడు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెస్తున్నా.. ఈ తమిళ సూపర్ స్టార్ మాత్రం ప్రతీ సారి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీంతో సామాన్యులు రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం అంటేనే అదో పెద్ద జోక్‌గా భావిస్తున్నారు. వచ్చినప్పుడు చూద్దాంలే అనే ధ్యాసలో ఉన్నారు. అయితే ఈ సారి మాత్రం రజనీకాంత్ […]
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం అనేది పెద్ద జోక్‌గా మారిపోయింది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రజనీ రాజకీయ అరంగేట్రం గురించి వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అభిమానులు ఎప్పటికప్పుడు రజనీకాంత్‌ను రాజకీయాల్లోకి రావాలని ఒత్తిడి తెస్తున్నా.. ఈ తమిళ సూపర్ స్టార్ మాత్రం ప్రతీ సారి వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. దీంతో సామాన్యులు రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం అంటేనే అదో పెద్ద జోక్‌గా భావిస్తున్నారు. వచ్చినప్పుడు చూద్దాంలే అనే ధ్యాసలో ఉన్నారు.
అయితే ఈ సారి మాత్రం రజనీకాంత్ చాలా సీరియస్ గానే కొత్త పార్టీపై ఆలోచన చేసినట్లు సన్నిహితులు తెలుపుతున్నారు. చాలా కాలంగా తమిళనాడులో పలు సర్వేలు చేయించి కొత్త పార్టీ పెట్టడానికి మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది. అన్నీ అనుకూలిస్తే మార్చి నెలలో రజనీ కొత్త పార్టీని ప్రకటించాలని భావించారట.
అయితే కరోనా నేపథ్యంలో పార్టీపై ప్రకటన చేయలేకపోయారని సమాచారం. కాగా, మరో రెండు మూడు నెలల్లో ఆయన కొత్త పార్టీ పెట్టడం ఖాయమనే అంటున్నారు రజనీ సన్నిహితుడు తియగరాజన్.
ఇప్పుడు రజనీకాంత్ కొత్త పార్టీకి ఏమని పేరు పెడతారోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే తన సహ నటుడు కమల్‌హాసన్ పార్టీని పెట్టారు. దీంతో రజనీకాంత్ కూడా రాజకీయ పార్టీ పెట్టాలని అభిమానులు ఒత్తిడి చేస్తున్నారు. కరోనా కారణంగా వాయిదా వేసిన పార్టీ ప్రకటన నవంబర్‌లో చేస్తారని సమాచారం.