వాళ్ల కంప్లైంట్‌లో కంటెంట్ లేదు.... గోరంట్ల విసుర్లు
టీడీపీ ఎంపీలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? కరోనా వైరస్ వ్యాప్తి చేసేందుకు ఢిల్లీకి వెళ్లారా? అసలు వాళ్ల కంప్లైంట్‌లో కంటెంట్ లేదు… అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సెటైర్లు విసిరారు. బీజేపీ వాళ్లు బయటకు తరిమేశారని… కరోనా అంటించేందుకు ఢిల్లీకి వెళ్లారా? అంటూ టీడీపీ ఎంపీలను గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు. అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఏమని కంప్లైంట్ ఇచ్చారని అన్నారు. ఢిల్లీకి వెళ్లి ఏపీ సర్కార్‌పై కంప్లైంట్ చేయడం తెలుగు ప్రజలను […]

టీడీపీ ఎంపీలు ఢిల్లీకి ఎందుకు వెళ్లారు? కరోనా వైరస్ వ్యాప్తి చేసేందుకు ఢిల్లీకి వెళ్లారా? అసలు వాళ్ల కంప్లైంట్‌లో కంటెంట్ లేదు… అంటూ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ సెటైర్లు విసిరారు.
బీజేపీ వాళ్లు బయటకు తరిమేశారని… కరోనా అంటించేందుకు ఢిల్లీకి వెళ్లారా? అంటూ టీడీపీ ఎంపీలను గోరంట్ల మాధవ్ ప్రశ్నించారు.
అన్ని రకాలుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఏమని కంప్లైంట్ ఇచ్చారని అన్నారు. ఢిల్లీకి వెళ్లి ఏపీ సర్కార్‌పై కంప్లైంట్ చేయడం తెలుగు ప్రజలను అవమానించడమేనని చెప్పారు.
రాష్ట్రపతి ఏపీలో జరుగుతున్న కార్యక్రమాలపై రిపోర్టు తీసుకుంటే… సీఎం జగన్ ను అభినందిస్తారని అన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోలేరని చెప్పారు.